- బ్రిటన్ వంటి దేశాల్లో 60 శాతానికి పైగా అభ్యర్థులు ఉద్యోగ వేటలో ఏఐ సాధనాలను వాడేందుకు విముఖత చూపుతుండగా, భారత్‌లో కేవలం 5 శాతం మంది యజమానులు, 8 శాతం మంది అభ్యర్థులు మాత్రమే ఈ సాంకేతికతకు దూరంగా ఉండటం గమనార్హం.
- గత దశాబ్ద కాలంలో భారత్ మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ విద్య వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలను వేగంగా స్వీకరించడంతో ఏఐ అనేది ఒక అడ్డంకిలా కాకుండా అవకాశాలను మెరుగుపరిచే ఒక సాధనంగా భారతీయులు భావిస్తున్నారు.
- ఇది కేవలం ఒక మార్పు మాత్రమే కాదని, అది అపారమైన వేగాన్ని ఇస్తుందని భారత్‌లోని పలు సంస్థలు నమ్ముతున్నాయి. వేల సంఖ్యలో వచ్చే దరఖాస్తులను వడపోసి, సరైన అభ్యర్థులను గుర్తించడంలో ఏఐ ఒక అద్భుతమైన 'ఎనేబులర్'గా పనిచేస్తోంది.
- అయితే ఈ సాంకేతికత స్క్రీనింగ్, మ్యాచింగ్‌కు మాత్రమే పరిమితం కావాలని, తుది నిర్ణయం మాత్రం మానవ మేధస్సుతోనే జరగాలనే ఒక అప్రకటిత ఒప్పందం యజమానులకు, అభ్యర్థులకు మధ్య కొనసాగుతోంది.
- మైక్రోసాఫ్ట్ ఇండియా చీఫ్ పునీత్ చందోక్ అంచనా వేసినట్లుగా, రాబోయే మూడేళ్లలో ఏఐ ఉద్యోగాలను హరించడం కంటే సృష్టించడమే ఎక్కువగా ఉంటుందనే ధీమా భారత మార్కెట్లో కనిపిస్తోంది.
- భారీ జనాభా, తీవ్రమైన పోటీ ఉన్న భారతదేశంలో నియామకాల్లో జరిగే గందరగోళాన్ని తగ్గించడానికి ఆటోమేషన్ ఒక ఒక అనివార్యమైన అవసరంగా మారింది.
- ఆటోమేటెడ్ వ్యవస్థలు కేవలం 'కీ వర్డ్స్' ఆధారంగా ప్రొఫైల్స్ ఎంపిక చేస్తున్నాయని, అభ్యర్థిలోని ప్రతిభను, అనుభవాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
- ఏఐ ఏజెంట్స్ అల్గారిథమ్స్ నమూనాలను మాత్రమే గుర్తించగలవు కానీ, ఒక వ్యక్తిలోని పట్టుదలను, సృజనాత్మకతను అంచనా వేయలేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- భారతదేశం ఏఐని స్వీకరించడంలో ముందున్నప్పటికీ, నియామకాల్లో పారదర్శకత, వివక్ష లేని అల్గారిథమ్స్, పటిష్టమైన పర్యవేక్షణ మార్గదర్శకాలు అత్యవసమని చెబుతున్నారు.
- సాంకేతికతను వాడుకోవడమే కాకుండా, దాన్ని ఎంత నైతికంగా అమలు చేస్తున్నామనేదే భారత్ ముందున్న అసలైన సవాలని నిపుణులు అంటున్నారు.
- నియామక ప్రక్రియలో మానవత్వపు విలువలను కోల్పోకుండా ఏఐని సమర్థవంతంగా వినియోగించుకున్నప్పుడే భారత్ ఈ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలదని సూచిస్తున్నారు.
70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్: ఎక్కువగా ఏ తెలుగు సినిమాకి వచ్చాయో తెలుసా..?
వ్యవసాయంలో AI వాడకంతో ఎన్ని కోట్లు ఆదాయం వస్తుందో తెలుసా..?
Meerut Metro: నమో భారత్ రైలు స్పెషల్ ఇదే..
దేశంలోనే తొలి సోలార్ బోట్..ఎక్కడో తెలుసా ?
ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే టాప్ 10 భాషలు ఇవే..
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

