Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెళ్లి పీటలెక్కబోతోన్న పూజా హెగ్దే.. అరేంజ్డ్ మ్యారేజ్‌కి బుట్టబొమ్మ గ్రీన్‌సిగ్నల్?

పెళ్లి పీటలెక్కబోతోన్న పూజా హెగ్దే.. అరేంజ్డ్ మ్యారేజ్‌కి బుట్టబొమ్మ గ్రీన్‌సిగ్నల్?

Telugu Samayam 2 weeks ago

న గ్లామర్, అభినయంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను దోచుకున్న పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఒకప్పుడు తన అందచందాలతో టాలీవుడ్‌ను ఊపేసిన ఈ స్టార్ హీరోయిన్ ఈసారి కొత్త సినిమా వార్తతోనో లేక గ్లామరస్ ఫోటోషూట్‌తోనో కాకుండా తన పెళ్లి వార్తలతో హాట్‌టాపిక్‌గా మారింది. పూజా హెగ్డే త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందంటూ ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

* 'కొరియన్ కనకరాజు' ట్రైలర్ టాక్: డ్యూయల్ రోల్‌లో వరుణ్ తేజ్ రచ్చ.. థియేటర్లో నవ్వుల జాతరే

గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న కథనాల ప్రకారం.. పూజా హెగ్డే సడెన్‌గా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధపడిందట. అయితే ఇది ప్రేమ వివాహం కాదని, పూర్తిగా కుటుంబ సభ్యులు కుదిర్చిన పెళ్లేనని తెలుస్తోంది. ఇంట్లో వారు చూసిన సంబంధానికి పూజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. అయితే ఆమె చేసుకోబోయే వరుడు సినీ రంగానికి చెందినవారా? లేక ఏదైనా బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న బడా వ్యాపారవేత్తా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ వార్తలపై ఇప్పటివరకు పూజా హెగ్డే లేదా ఆమె టీమ్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, అభిమానులు మాత్రం ఈ బుట్టబొమ్మ నుంచి గుడ్ న్యూస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పూజా హెగ్డే సినీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. నాగచైతన్య సరసన 'ఒక లైలా కోసం' (2014) చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ 'ముకుంద' సినిమాలోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రారంభంలో సరైన విజయాలు లేక 'ఐరన్ లెగ్' అనే ముద్ర పడినప్పటికీ, అల్లు అర్జున్‌తో చేసిన 'డిజె: దువ్వాడ జగన్నాథమ్' (2017) సినిమాతో ఆమె జాతకమే మారిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత వీర రాఘవ', మహేష్ బాబుతో 'మహర్షి', అల్లు అర్జున్‌తో 'అలా వైకుంఠపురములో' వంటి పరిశ్రమ రికార్డులను తిరగరాసిన చిత్రాలతో టాలీవుడ్‌లో 'గోల్డెన్ లెగ్'గా మారి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచింది. 'రంగస్థలం'లోని "జిగేలు రాణి" స్పెషల్ సాంగ్‌తో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

* చిరంజీవి ఎంత సాయం చేశారో నాకు తెలుసు.. పావలా శ్యామల కుమార్తె ఆరోపణలపై సురేష్ కొండేటి ఫైర్

అయితే ఆ తర్వాత 'రాధే శ్యామ్', 'ఆచార్య', తమిళంలో 'బీస్ట్' వంటి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడటంతో ఆమె కెరీర్ మళ్లీ ఊహించని మలుపు తిరిగింది. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో చేసిన 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్', 'దేవా', 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమాలు కూడా నిరాశపరచడంతో ఆమె అవకాశాలు కాస్త మందగించాయి. అయినప్పటికీ వెనక్కి తగ్గని పూజా హెగ్డే, మళ్లీ సౌత్ పరిశ్రమలో తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. గతేడాది రజినీకాంత్ 'కూలీ'లో మోనికా అంటూ ఆమె చేసిన స్పెషల్ సాంగ్ పూజా కెరీర్‌కు కొత్త ఊపిరి ఇచ్చింది. ప్రస్తుతం మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ సరసన 'శ్రీశ్రీ' చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, రాఘవ లారెన్స్ ల్యాండ్‌మార్క్ హారర్-కామెడీ ప్రాజెక్ట్ 'కాంచన 4' లోనూ ఫిమేల్ లీడ్‌గా చేస్తోంది. అలాగే ఆమె అల్లు అర్జున్ సరసన మరోసారి నటించనుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఒకవైపు క్రేజీ ప్రాజెక్ట్‌లతో రీ-ఎంట్రీ ఇస్తూనే, మరోవైపు పర్సనల్ లైఫ్‌ను సెట్ చేసుకునే పనిలో బుట్టబొమ్మ బిజీగా ఉందన్న వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam