Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్కోడా స్లావియా లేటెస్ట్ ధరలు... మిడిల్ క్లాస్ సెడాన్ మైలేజ్ , ఫీచర్స్

స్కోడా స్లావియా లేటెస్ట్ ధరలు... మిడిల్ క్లాస్ సెడాన్ మైలేజ్ , ఫీచర్స్

Times Now Telugu 5 days ago

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో స్కోడా స్లావియా సెడాన్‌ మోడల్ గా అందుబాటులో ఉంది . ఈ కారు ఆధునిక డిజైన్, విశాలమైన ఇంటీరియర్, శక్తివంతమైన ఇంజిన్ పెర్ఫార్మన్స్ తో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.

స్లావియా స్కోడా యొక్క MQB-A0-IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు . ఇది ప్రత్యేకంగా భారతీయ రోడ్ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ కారు లోపల లగ్జరీ ఇంటీరియర్ తో పాటు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. టెక్నాలజీ పరంగా టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టివిటీ ఫీచర్లు, సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌తో ఇది వినియోగదారుల అవసరాలకనుగుణంగా ఉంటుంది . స్కోడా స్లావియా మధ్యతరగతి కుటుంబాలకు సరైన ఎంపికగా నిలుస్తూ స్టైల్ , ప్రాక్టికాలిటీని అందిస్తుంది .
స్కోడా స్లావియా
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రీమియం లుక్ , ఆధునిక టెక్నాలజీతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ కారు రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో 1.0 TSI , 1.5 TSI అందుబాటులో ఉంటుంది. 1.0 TSI ఇంజిన్ 85 kW పవర్‌ను ఉత్పత్తి చేస్తూ 6-స్పీడ్ మాన్యువల్ , ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 TSI ఇంజిన్ 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో శక్తివంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మైలేజ్ పరంగా, 1.0 TSI సుమారు 18-20 kmpl వరకు ఇస్తుంది. 1.5 TSI DSG సుమారు 17-19 kmpl వరకు అందిస్తుంది.

ఫీచర్స్
ఇంటీరియర్‌లో వర్చువల్ కాక్‌పిట్, 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, అంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ పరంగా 40+ యాక్టివ్ , పాసివ్ ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS, ESC, హిల్ హోల్డ్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. స్పెన్షన్‌లో మాక్‌ఫర్సన్ స్ట్రట్ ఫ్రంట్, టార్షన్ బీమ్ రియర్ సస్పెన్షన్ ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రియర్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి.

4 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ & 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 4 ఫ్రీ సర్వీసెస్ అందిస్తున్నారు.స్లావియా వేరియంట్స్‌లో Classic, Signature, Sportline, Prestige, Monte Carlo వంటి ఆప్షన్లు ఉన్నాయి.

వేరియంట్ ధరలు
Classic 1.0 మ్యాన్యువల్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర ₹ 9 99 900/-
Signature 1.0 TSI మ్యాన్యువల్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర ₹ 13 28 000/-
Sportline 1.0 TSI మ్యాన్యువల్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర ₹ 13 49 000/-
Prestige 1.0 TSI మ్యాన్యువల్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర ₹ 14 99 900/-
Sportline 1.0 TSI ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర ₹ 14 55 000/-
Prestige 1.0 TSI ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర ₹ 16 43 000/-
Monte Carlo 1.0 TSI ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర ₹ 16 49 000/-
Prestige 1.5 TSI DSG ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర ₹ 17 93 000/-
Monte Carlo 1.5 TSI DSG ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర ₹ 17 99 000/-
MQB-A0-IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన ఈ కారు భారతీయ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు . విస్తృతమైన లెగ్‌రూమ్, పెద్ద బూట్ స్పేస్, ప్రీమియం డిజైన్‌తో ఇది మధ్యతరగతి కుటుంబాలకు సరైన ఎంపికగా నిలుస్తుంది. స్కోడా స్లావియా, స్టైల్, పెర్ఫార్మన్స్ , సేఫ్టీ, టెక్నాలజీని తో భారతీయ ఆటోమొబైల్ రంగంలో పోటీని ఇస్తుంది .

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu