Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సోనీ Inzone H6 Air గేమింగ్ హెడ్‌సెట్‌ లాంచ్... ధరలు,ఫీచర్స్ ఇవే

సోనీ Inzone H6 Air గేమింగ్ హెడ్‌సెట్‌ లాంచ్... ధరలు,ఫీచర్స్ ఇవే

Times Now Telugu 6 days ago

సోనీ తాజాగా భారతదేశంలో తన కొత్త Inzone H6 Air గేమింగ్ హెడ్‌సెట్‌ను లాంచ్ చేసింది. హెడ్‌సెట్‌ను గేమింగ్ ఆడియో అనుభవాన్ని సహజంగా, క్వాలిటీ తో అందించాలి అనే లక్ష్యం తో మార్కెట్ లో కి తీసుకువచ్చింది .

గేమర్లకు సౌండ్ కేవలం వినిపించడం మాత్రమే కాకుండా గేమ్‌లోని ప్రతి క్షణాన్ని నిజంగా అనుభవించేలా చేయడం ఈ హెడ్ సెట్ ప్రధాన ఉద్దేశ్యం.ఈ హెడ్‌సెట్‌ను ప్రత్యేకంగా PC , PlayStation వినియోగదారుల కోసం రూపొందించారు. గేమ్ డెవలపర్లు ఊహించిన విధంగా శబ్దాన్ని వినిపించడానికి,ఆటలోని ప్రతి మూవ్ మెంట్ ఎంజాయ్ చేయడానికి ఇది సహాయపడుతుంది. గేమింగ్ ప్రపంచంలో సౌండ్ కీలక పాత్ర పోషిస్తుందని ఈ కొత్త హెడ్ సెట్ ద్వారా వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందించేలా సోని దీనిని అందిస్తుంది .
సోనీ INZONE H6 Air గేమింగ్ హెడ్‌సెట్‌
సోని భారతదేశంలో INZONE H6 Air గేమింగ్ హెడ్‌సెట్‌ను లాంచ్ చేసింది. ఈ హెడ్‌సెట్ గేమర్లకు సహజమైన సౌండ్ అనుభవాన్ని అందించడానికి ప్రత్యేకంగా రూపొందించారు . దీని ఓపెన్-బ్యాక్ డిజైన్ వలన గేమ్ క్రియేటర్ ఊహించిన విధంగా మంచి సౌండ్‌స్టేజ్ వినియోగదారులకు అందుతుంది . సుమారు 199 గ్రాములు తేలికైన నిర్మాణం లాంగ్ టైం గేమింగ్ సెషన్లలో కంఫర్ట్ కలిగిస్తుంది. ఈ హెడ్‌సెట్‌లో ఉపయోగించిన 40mm డ్రైవర్ యూనిట్ సోనీ MDR-MV1 ప్రొఫెషనల్ మానిటర్ హెడ్‌ఫోన్ల నుండి ప్రేరణ తో లో- బాస్ నుండి స్పష్టమైన హైస్ వరకు విస్తృతమైన ఫ్రీక్వెన్సీ రేంజ్‌ను అందిస్తుంది.

ఇది USB-C ఆడియో బాక్స్ ద్వారా 360 స్పేషియల్ సౌండ్‌ను ANDISTUNDI. దీని ద్వారా వర్చువల్ 7.1 చానల్ సౌండ్ అనుభవం పొందవచ్చు . గేమ్‌లో అడుగుల శబ్దం, గన్‌ఫైర్ , ప్రతి కదలిక మరింత స్పష్టంగా గుర్తించడానికి ఇది సహాయపడుతుంది. PlayStation Studios సౌండ్ ఇంజినీర్లతో కలిసి రూపొందించిన RPG , Adventure ఈక్వలైజర్ ప్రొఫైల్ గేమ్ సూపర్ గ ఎంజాయ్ చేసేలా చేస్తుంది.

మైక్రోఫోన్ చుస్తే ఇది డిటాచబుల్ బూమ్ మైక్‌తో వస్తుంది. కార్డియాయిడ్ ప్యాటర్న్ వాయిస్‌ను స్పష్టంగా రికార్డ్ చేస్తూ చుట్టూ ఉన్న నాయిస్ తగ్గిస్తుంది. ఫ్లెక్సిబుల్ ఆర్మ్ వలన వినియోగదారుడు సెట్ చేసిన ప్రకారం మైక్ స్థిరంగా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా ఇది PC , PS5 రెండింటికీ అనుకూలంగా ఉంటుంది.
ధర
Sony Inzone H6 Air హెడ్ సెట్ భారతదేశంలో ₹17,990 ధరకు లభిస్తోంది. మీరు దీన్ని Sony ShopatSC లేదా Amazon India ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Sony INZONE H6 Air గేమర్లకు అధిక నాణ్యత గల ఆడియో, తేలికైన నిర్మాణం, సహజమైన శబ్దం, గేమింగ్ కమ్యూనిటీకి కొత్త స్థాయి ఆడియో అనుభవాన్ని అందిస్తూ సోనీ యొక్క Zero Environmental Footprint లక్ష్యానికి అనుగుణంగా పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడింది.గేమింగ్ లో ప్రతి సౌండ్ ను ఎంజాయ్ చేస్తూ ఆడాలి అనుకునేవారికి బెస్ట్ ఎంపిక

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu