Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
100 నియోజకవర్గాల్లో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు

100 నియోజకవర్గాల్లో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు

వార్త 4 months ago

రాష్ట్రంలో 100 నియోజక వర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి(CM Revanth) వెల్లడించారు..

25 ఎకరాల్లో 5 నుంచి 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2500 విద్యార్థులతో 20 వేల కోట్లతో నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఓ ప్రైవేటు విద్యాసంస్థ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెండో విడతలో మరిన్ని స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ విద్య పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.. దేశంలో అన్ని ప్రాంతాలకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉందని పేర్కొన్నారు.

Read Also: Minister Seethakka: గ్రామ సభలు విజయవంతం

 CM Revanth: ‘Young India Integrated Schools’ to be established in 100 constituencies

బ్లూ కాలర్ ఉద్యోగాలు

ఒక విద్యార్ధి పైన రాష్ట్ర ప్రభుత్వం లక్షా 8 వేల రూపాయలు ఖర్చు పెడుతోందని వివరించారు. ఏఐ కారణం గా పెద్దయెత్తున ఉద్యోగాలు పోతాయనే ఆందోళన ఉందన్నారు.. వైట్ కాలర్ ఉద్యోగాలకు బదులు బ్లూ కాలర్ ఉద్యోగాలు పెంచు కోవాల్సిన అవసరం ఉంది.. ఇందుకోసం నాణ్యమైన సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తీర్ణత సాధిస్తున్నారు.. ఎక్కువ మంది విద్యార్థులకు సర్టిపికేట్ ఉంటుంది కానీ స్కిల్స్ ఉండటం లేదన్నారు. ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.

11 వేల ప్రైవేట్ స్కూల్స్ 33 లక్షల మంది విద్యార్థులు

రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ స్కూల్స్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే 11 వేల ప్రైవేట్ స్కూల్స్ 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. ప్రభుత్వ విద్య వైఫల్యం పైన అందరూ ఆలోచించాలి.. పేదరికానికి కారణం విద్య లేకపోవడమే.. విద్య వల్లనే గుర్తింపు, గౌరవం లభిస్తుందని చెప్పారు.. ఆరుట్ల మోడల్ స్కూల్లో నాణ్యమైన విద్య అందుతుంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ స్కూల్స్ లో నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, భోజనం అందిస్తాం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. 2034లో జరగబోయే ఒలంపిక్స్లోలో తెలంగాణ నుంచి గోల్డ్ మెడల్స్ తీసుకు రావడమే లక్ష్యంగా తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బాక్సర్ నిక్కత్ జరీన్, క్రికెటర్ సిరాజ్కు డిఎస్పీ ఉద్యోగం ఇచ్చామని పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఫీజుల వసూలుపై హైకోర్టు తీర్పు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha