Dailyhunt
గ్రామ సభలు విజయవంతం

గ్రామ సభలు విజయవంతం

వార్త 1 week ago

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభలు విజయవంతంగా పూర్తి కావడంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క(Minister Seethakka ) హర్షం వ్యక్తం చేశారు.

గ్రామ స్థాయిలో ప్రజా పాలనను బలోపేతం చేసే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో సహకరించారన్నారు. ఈ విషయమై శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ సభల్లో గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, తాగునీటి సమస్యలు, పారిశుధ్యం, మౌలిక వసతులపై విసృతంగా చర్చలు జరగడం శుభపరిణామమని మంత్రి పేర్కొన్నారు.

Read Also:Karimnagar Crime: కవల పిల్లలను కడతేర్చిన కసాయి తండ్రి!

 Minister Seethakka: Gram Sabhas are a success

ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా ఈ కార్యక్రమాన్ని వ్యక్తపరిచి, అధికారులు వాటిని శ్రద్ధగా స్వీకరించడం ప్రజాస్వామ్యానికి బలాన్ని చేకూర్చిందన్నారు. విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డ్ సభ్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ దివ్యాదేవరాజన్, అన్ని స్థాయిలోని అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధితశాఖల అధికారులకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం ఇలాంటి ప్రజాపాలన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. గ్రామం కేంద్రంగా అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించడం ద్వారా అభివృద్ధి పరిపూర్ణమవుతుందని పేర్కొన్నారు. ఇకపై గ్రామ సభల్లో వచ్చిన సూచనలు, సమస్యలను ప్రాధాన్యతతో తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో పారదర్శకత, బాధ్యతాయుత పాలనను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

3,699 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సీజ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha