Dailyhunt
ఫీజుల వసూలుపై హైకోర్టు తీర్పు

ఫీజుల వసూలుపై హైకోర్టు తీర్పు

వార్త 2 weeks ago

Fee Reimbursement Issue: విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసి.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ చేసిన తరువాత తిరిగి ఇవ్వా లని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా యి.

ఈ తీర్పుతో పేదలపై తీవ్రమైన ఆర్థికభారం పడుతుందని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఫీజు బకాయిలపై ఇచ్చిన తీర్పులో విద్యార్థుల నుండి వసూళ్లు చేసుకోని ప్రభుత్వం ఇచ్చిన తర్వాత తిరిగి విద్యార్థులకు చెల్లించాలన్న తీర్పు సరైనది కాదని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఎ) తెలంగాణ రాష్ట్ర కమిటీ అభిప్రాయ పడింది. ఇది విద్యార్థుల చదువుల అభివృద్ధికి గౌడలిపెట్టని హైకోర్టు తీర్పును పునఃసమీక్ష చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు డిమాండ్ చేశారు.

Read Also: Minister Seethakka: గ్రామ సభలు విజయవంతం

 Fee Reimbursement Issue: High Court verdict on fee collection

ఫీజు పథకం అమలు

ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వం ప్రకటించిన ఫీజు పథకం అమలు చేస్తామని అంగీకారాన్ని తెలిపి విద్యార్థులను చేర్చుకున్నారని, అలాంటిది ప్రైవేటు యాజమాన్యాల 10. చేస్తున్న బకాయిలను చెల్లించకుండా, విద్యార్ధుల నుంచి వసూళ్లు చేసుకోండి అనే తీర్పు సరైనది కాదన్నారు. అణాగారిన వర్గాల నుండి ఇప్పుడే ఉన్నత విద్యలోకి వస్తున్నా రని ప్రధానంగా ఈ ఫీజులు పోందే వారు పేద విద్యార్థులు వారిలో రాష్ట్రంలో 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనారిటీ విద్యార్థులలే ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు బకాయిలు రావడం లేదని పేద విద్యార్థుల సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వేధింపులు గురి వేస్తున్నారని, గతంలో విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని తెలిపారు.

ఫీజు రీయంబర్స్, స్కాలర్ షిప్స్ విడుదల

ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ఫీజు రీయంబర్స్, స్కాలర్ షిప్స్ విడుదల చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, హైకోర్టు తీర్పును పునఃసమీక్ష చాలా చేయాలని, ప్రభుత్వానికి తక్షణమే ఫీజుల విడుదల కోసం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్
విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలన్న హైకోర్టు తీర్పుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బకాయిలపై హైకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పు పేద, మధ్య తరగతి విద్యార్థులకు వ్యతిరేకంగా ఉందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి మండిపడింది. ఫీజు రియంబర్స్మెంట్ రాని విద్యార్థుల వద్ద నుండి ఫీజులు వసూలు చేసుకోమని వచ్చిని, తర్వాత విద్యార్థులకు చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. ఈ తీర్పుపై హైకోర్టు పునరాలోచించాలని, రాష్ట్రంలో లక్షలాదిమంది.

బకాయిలు ఏకకాలంలో విడుదల చేయాలని డిమాండ్

విద్యార్థులు ఉన్నత విద్య చదివేది ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై ఆధారపడేనని, అలాంటి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి బకాయిలు ఇవ్వకుండా గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వాలు విద్యార్థుల చదువులతో చెలగాట మాడుతున్నాయన్నారు. విద్య సంవత్సరం పూర్తి అయిన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం వెళ్తే యాజమాన్యాలు ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులను వేధిస్తున్నారని, లక్షలాది మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లు తీసుకోకుండా ఉన్నత విద్యకు దూరంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా పైసలు కట్టి సర్టిఫికెట్ తీసుకునే ఆర్ధిక పరిస్థితులు లేరని, హైకోర్టు ఫీజు రీయింబర్స్ మ్మెంట్ విడుదలపై ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించి అలోపు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని, ఫీజులు వసూలు వేసుకోవాలని కళాశాలలకు హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైంది కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చలనం కలిగి వెంటనే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏకకాలంలో విడుదల చేయాలని మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కుల గణనలో బిసిలకు అన్యాయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha