Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
104 సంచార వైద్య వాహనాల్లో 41 రకాల ఉచిత సేవలు

104 సంచార వైద్య వాహనాల్లో 41 రకాల ఉచిత సేవలు

వార్త 3 months ago

AP Medical Vehicles: 104 సంచార వైద్య వాహనాలను సమర్థంగా అందించాలని భావిస్తోంది. 104 సంచార వైద్య వాహనాలకు కొత్త రూపు ఇచ్చి 41 రకాల మెడికల్ టెస్ట్లు భాగంగానే పల్లె ముంగిటకు వైద్య పరీక్షలు చేరువ చేసి, వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా ఏటా 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.162.72 కోట్లు వెచ్చించనుంది. ఈ ల్యాబ్ డయాగ్నస్టిక్ సేవలను పల్నాడు, కృష్ణా జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించా రు. ఇవి సత్ఫలితాలు ఇవ్వడంతో చిత్తూరు జిల్లా కుప్పంలో అమల్లోకి తెచ్చారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ సేవలు అందు బాటులోకి తెస్తారు.

Read Also : AP Weather update: ఏపీలో నిప్పుల కుంపటి.. 45 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు

 41 types of free services in 104 mobile medical vehicles

AP Medical Vehicles: మొబైల్ మెడికల్ యూనిట్ల వివరాలు

ఆంధ్రప్రదేశ్లో 104 మొబైల్ మెడికల్ యూనిట్లు (ఎంఎంయూ) 936 ఉన్నాయి. వీటిలో 904 వాహనాలు క్షేత్రస్థాయి లో వినియోగించనున్నారు. మిగిలిన 32ను అత్యవసర పరిస్థితుల్లో తిప్పేందుకు సిద్ధంగా ఉంచారు. వీటిని కొత్త హంగులతో అందుబాటు లోకి తెస్తారు. ఇప్పటికే ఆరోగ్య రథం పేరుతో కొన్ని వాహనాలు నమూనాగా సిద్ధం చేశారు. పేషెంట్ల ఆరోగ్యం నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు నిర్వహించనుంది. ఇటీవలే వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు పరిపాలన ఆమోదం, నిర్వహణ మార్గదర్శకాలు జారీకి కేబినెట్ అనుమతిచ్చింది. దీంతో ప్రాజెక్టు అమలుకు మార్గం సుళువైంది.

41 రకాల టెస్ట్లు.. 80 రకాల మందులు

ఒక్కో 104 వాహనంలో 41 రకాల టెస్ట్లు చేస్తారు. 80 రకాల మందులు అందుబాటులో ఉంచుతారు. సంపూర్ణ రక్త పరీక్ష (సిబిపి)కి సంబంధించిన 22 పరీక్షలు, బయో కెమిస్ట్రీకి సంబంధించిన 19 పరీక్షలు అందుబాటులోకి తెస్తారు. కొత్త విధానంలో ఒక మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) రోజుకు 20 నమూనాలు సేకరించాలి. వైద్య బృందంతోపాటు, ల్యాబ్ టెక్నీషియన్లను పంపి ఇళ్ల దగ్గరే వైద్య పరీక్షలు చేస్తారు. అక్కడే నమూనాలు సేకరించి పరీక్షించి సాయంత్రానికి ఫలితాలను మొబైల్ ద్వారా రోగులకు అందిస్తారు. అంతేకాక ప్రతి ఒక్కరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు తెరుస్తారు. వారి ఆరోగ్య స్థితిని ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు నిర్వహణ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మహిళలపై అఘాయిత్యాలు.. 48 గంటల్లోనే నిందితుల అరెస్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha