ఫలితాలను ముఖ్యమంత్రి విడుదల చేసే అవకాశం
TG Inter Results 2026: రాష్ట్రంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలను ఈ నెల 12న విడుదల చేయడానికి ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది.
ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే విద్యాశాఖ కూడా కొనసాగుతున్నందున ఇంటర్ ఫలితాలను సీఎం స్వయంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితాలను సీఎం ఇంటి దగ్గర విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also : Lala Guda: లాలాగుడ పోలీస్ స్టేషన్‌లో 'పిల్లి' లొల్లి
Results announced by CM Revanth Reddy.
TG Inter Results 2026: విద్యా పథకాల ప్రకటన
సీఎం ఫలితాలను విడుదల చేయడానికి కారణం.. రానున్న 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయడంతో పాటు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉదయం బ్రేక్ఫాస్ట్లోపాటు, పాలు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మార్చి 20న ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఇందుకు సంబంధించి నిధులను సైతం కేటాయించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం రూ.70 కోట్లను కేటాయించగా.. బ్రేక్ఫాస్ట్, పాలు ఇవ్వడం కోసం రూ.56 కోట్లను కేటాయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయం బ్రేక్ఫాస్ట్ను అమలు చేసే విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటిస్తూ.. ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మూల్యాంకనం, ఫలితాల క్రోడీకరణ
ఈ నెల 12న కాకపోతే 13న ఇంటర్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25న ప్రారంభమై మార్చి 18తో ముగిశాయి. ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని మార్చి 15 నుంచి 20 కేంద్రాల్లో ప్రారంభించారు. ఈ నెల1తో మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. మూల్యాంకన అనంతరం ఫలితాల విడుదలకు సంబంధించిన క్రోడీకరణ పనులను ఇంటర్ బోర్డు అధికారులు ఈ నెల 8 వరకు పూర్తి చేశారు. ఇంటర్ ఫలితాల విడుదల కోసం ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ఈ నెల 9, 10, 11 తేదిల్లో ఏదో ఒకరోజు విడుదల చేయడానికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిసింది. గురువారం ఇంటర్ బోర్డు అధికారులు విద్యాశాఖ అధికారులతో చర్చించిన అనంతరం ఈ నెల 12న ఫలితాలను విడుదల చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒకవేళ ఈ నెల 12న వీలుకాకపోతే 13న ఇంటర్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

