Lalaguda: హైదరాబాద్ లాలాగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.లాలాగుడలో నివసించే ఒక యువతి తన పెంపుడు పిల్లి కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందింది.
పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీని పరిశీలించగా, ఒక వ్యక్తి తోపుడు బండిపై (Cart) వెళ్తూ పిల్లిని ఎత్తుకెళ్లినట్లు తేలింది. ఆ బండి నంబర్ ఆధారంగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Also:Macherla Crime: మాచర్ల కేసులో ట్విస్ట్: గూగుల్ మ్యాప్స్ సాయంతో వచ్చి అఘాయిత్యం!
Lalaguda cat theft incident
Lala Guda: స్టేషన్‌లో సీన్ రివర్స్
పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించి స్టేషన్‌కు పిలిపించారు. తన పిల్లిని తిరిగి ఇవ్వమని యువతి గట్టిగా నిలదీయగా, ఆ వ్యక్తి “పిల్లి నా దగ్గరే ఉంది, బాగానే ఉంది” అని సమాధానం ఇచ్చాడు. అయితే, పోలీసులు ఆ పిల్లిని తీసుకురమ్మని చెప్పగా.. “దానిని పట్టుకుని స్టేషన్ దగ్గరకు తీసుకువస్తుండగా నా చేతిలోంచి జారి పారిపోయింది” అని బాంబు పేల్చాడు.
తన పిల్లి పారిపోవడానికి ఆ దొంగే కారణమని, అది దొరికే వరకు వదిలేది లేదని ఆ యువతి స్టేషన్‌లోనే గొడవకు దిగింది. ఆమె ఎంతకీ శాంతించకపోవడంతో, ఏం చేయాలో పాలుపోని ఆ వ్యక్తి.. స్టేషన్ అందరి ముందే బాధితురాలి కాళ్లు పట్టుకుని బతిమిలాడటం మొదలుపెట్టాడు. తనకు పిల్లి ఎక్కడ ఉందో తెలియదని, తనను వదిలేయాలని వేడుకున్నాడు.పరిస్థితి మరీ వింతగా మారడంతో పోలీసులు ఇద్దరినీ సముదాయించారు. సదరు వ్యక్తికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించివేశారు. పిల్లి కోసం గాలిస్తామని యువతికి హామీ ఇచ్చి పంపించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

