Dailyhunt
రేషన్ షాపుల వద్ద బారులు.. ఎండలోనే బియ్యం కోసం పడిగాపులు

రేషన్ షాపుల వద్ద బారులు.. ఎండలోనే బియ్యం కోసం పడిగాపులు

వార్త 1 week ago

Telangana Ration Shops: ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యం పంపిణీతో ఇటు లబ్దిదారులు అటు రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి ఎండల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఎప్రిల్, మె, జూన్ మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ఈ నెల 1 నుండి ప్రారంభమైంది.

దీంతో ఎండలను సైతం లెక్కచేయకుండా ఎక్కడ చూసినా చౌకధరల దుకాణాల వద్ద లబ్దిదారులు బారులు తీరుతున్నారు. ఈ నెలాఖరు వరకు బియ్యం పంపిణి కొనసాగుతుందని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నా పోర్టబులిటి నేపథ్యంలో సమీప దుకాణంలో ఎక్కడ బియ్యం అయిపోతాయోమెనన్న ఆందోళనతో లబ్దిదారులు రేషన్ దుకాణాలకు పోటెత్తుతున్నారు.

Read Also : Yasangi Paddy Procurement: యాసంగి ధాన్యం కొనుగోళ్లు షురూ

 Distribution of three months’ rice at a time: Difficulties faced by beneficiaries.

Telangana Ration Shops: నిల్వ సామర్థ్యం లేక “నో స్టాక్” బోర్డులు

అయితే రేషన్ దుఖాణాల్లో బియ్యం నిల్వ సామర్థ్యం ఆధారంగా మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి కాకుండా ఎంఎల్ఎస్ పాయింట్ల నుండి విడతల వారిగా సరఫరా అవుతున్నాయి. అయితే రేషన్ బియ్యం పంపిణీకి అనుగుణంగా బియ్యం సరఫరా ఉండటం లేదని లబ్దిదారులు, డీలర్లు వాపోతున్నారు.

3 నెలల కాలానికి సంబంధించిన బియ్యం చౌకధరల దుకాణాల్లో నిల్వ చేసుకునే సౌకర్యం లేకపోవడం ఒక కారణం కాగా మరోవైపు రేషన్ దుకాణంలో నిండుకున్న నిల్వల స్థానంలో కొత్త కోటా విడుదల చేసే అవకాశం లేకపోవడంతో దుకాణాల ముందు నో స్టాక్ బోర్డ్ పెట్టాల్సిన పరిస్థితి తతెత్తుతోందని డీలర్లు వెల్లడిస్తున్నారు.
ఈ రేషన్ బియ్యం వచ్చిన వెంటనే లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఎగబడుతున్నారు. 3 నెలల కాలానికి బియ్యం ఏకకాలంలో తూకం వేసి ఇస్తుండటంతో కొద్దిసేపటికే నిల్వలు నిండుకుంటున్నాయి.

రవాణా ఇబ్బందులు

నిండుకున్న బియ్యం స్థానంలో కొత్తవి తీసుకురావడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న వాహనాలు, అదే హమాలీ కార్మికులతో 3 నెలల బియ్యం రవాణా చేయాల్సి వస్తోందని, దీంతో చౌకధరల దుకాణాలను వర్గీకరించి రోజుకో ప్రాంతానికి సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఇలా చేస్తుండటంతో ముందుగా రేషన్ బియ్యం నిల్వలు నిండుకున్న దుకాణాలకు 3 రోజులు అవుతున్నా రావడం లేదని తెలుస్తోంది. దీంతో లబ్దిదారులు ఆ రేషన్ దుకాణాల వద్దకు వచ్చి నో స్టాక్ బోర్డు చూసి వెనుదిరుగుతున్నారని సమాచారం.

మౌలిక సదుపాయాల కొరత

చౌకధరల దుకాణాలను అద్దెకు తీసుకునే సమయంలో వారి కోటా సామర్థ్యానికి అనుగుణంగా దుకాణాలను అద్దెకు తీసుకున్నారు. ప్రభుత్వం 3 నెలల కాలానికి బియ్యం ఏకకాలంలో పంపిణీ చేపడుతుండటంతో రేషన్ దుకాణాలు సరిపోవడం లేదని డీలర్లు అంటున్నారు. సాధారణంగా రేషన్ బియ్యం తీసుకునేందుకు చాలా వరకు మహిళలు, వృద్ధులు చౌకదరల దుఖాణాలకు వస్తుంటారు. ఈ క్రమంలో వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని రేషన్ దుకాణాల వద్ద తప్పనిసరిగా తాగునీరు, నీడ కోసం టెంట్ తదితర కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉన్నా చాలా వరకు రేషన్ డీలర్లు సౌకర్యాల కల్పనకు మంగళంపాడారు.

చాలా చోట్ల కనీసం తాగునీటి వసతి కూడా లేకపోవడంతో రేషన్ బియ్యం కోసం వచ్చిన లబ్దిదారుల గొంతెండుతోంది. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 17,170 సరసమైన ధరల దుకాణాలు ఉన్నాయి. రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య కోటి మార్కును దాటి సుమారు 1.01 కోట్లకు చేరుకుంది. వీటిల్లో 99.36 లక్షల కార్డులు ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 3.25 కోట్ల మంది లబ్దిదారులు ప్రయోజనం పొందుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

హైదరాబాద్ లో రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు.. 190 మందికి పాజిటివ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha