Dailyhunt
14 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ప్రసవంతో బయటపడ్డ నిజం

14 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ప్రసవంతో బయటపడ్డ నిజం

వార్త 2 weeks ago

Kurnool POCSO Act Case: ఏపీలోని కర్నూలులో అమానుష ఘటన వెలుగుచూసింది. పాఠశాలకు తీసుకెళ్లే ఆటో డ్రైవర్ తన స్నేహితుడితో కలిసి 14 ఏళ్ల బాలిక జీవితాన్ని నాశనం చేశాడు.

ఇద్దరూ రోజుల తరబడి లైంగిక దాడి చేయడంతో బాలిక గర్భం దాల్చింది. సోమవారం ఆ విద్యార్థిని ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనివ్వడంతో ఈ దారుణం బట్టబయలైంది.

Read Also : Nellore Crime: కొడవలూరులో జంట హత్యలు.. ప్రేమ వ్యవహారమే కారణమా..?

 Rape of 14-year-old girl.. The truth came out with childbirth.

Kurnool POCSO Act Case: నమ్మించి వంచించిన ఆటో డ్రైవర్

కర్నూలు నగర శివారు గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లేందుకు ఆటోను ఆశ్రయించేది. ఆ ఆటోను నడిపే బోయ మహేంద్ర అనే డ్రైవర్, బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నాడు. ఆమెను మభ్యపెట్టి లోబరుచుకోవడమే కాకుండా, తన స్నేహితుడైన ట్రాక్టర్ డ్రైవర్ తెలుగు శివకుమార్‌ను కూడా ఈ పాపంలో భాగస్వామిని చేశాడు. నిందితులిద్దరూ కలిసి ఆ మైనర్ బాలికపై రోజుల తరబడి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని బాలికను తీవ్రంగా హెచ్చరించారు. ఆ మృగాల బెదిరింపులకు భయపడిపోయిన బాధితురాలు, తన నరకాన్ని గుండెల్లోనే దాచుకుంది. ఇంట్లో చెబితే ఎక్కడ చంపేస్తారోనన్న ఆందోళనతో మౌనంగా ఉండిపోయింది.

ఆసుపత్రిలో ప్రసవం.. షాక్‌లో తల్లిదండ్రులు

బాలిక అనారోగ్యానికి గురికావడంతో, ఆమె తల్లిదండ్రులు ఈ నెల 28న కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేయగా ఆమె గర్భవతి అని తేలింది. అదే రోజు ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. మైనర్ బాలిక ప్రసవించడంతో వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం బాధితురాలు, ఆమె నవజాత శిశువు అధికారుల సంరక్షణలో చికిత్స పొందుతున్నారు. నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

చనిపోయిన అంగన్‌వాడీ కార్యకర్తకు షోకాజ్ నోటీసులు.. అధికారుల నిర్లక్ష్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha