Dailyhunt
'15 ఏళ్ల కుర్రాడు కొట్టాడని బాధ లేదు': భువనేశ్వర్

'15 ఏళ్ల కుర్రాడు కొట్టాడని బాధ లేదు': భువనేశ్వర్

వార్త 1 week ago

Bhuvneshwar Kumar on Vaibhav: రాజస్థాన్ రాయల్స్ కనుగొన్న సరికొత్త క్రికెట్ అద్భుతం వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ లో, ప్రపంచస్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ అతను చూపుతున్న తెగువ ఇప్పుడు యావత్ క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

శుక్రవారం (ఏప్రిల్ 10) నాడు గౌహతిలోని బర్సపారా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో, వైభవ్ తన విధ్వంసక బ్యాటింగ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆశలను చిదిమేశాడు.భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి హేమాహేమీలను ఎదుర్కొంటూ కేవలం 26 బంతుల్లో 78 పరుగులు బాదాడు. వైభవ్ ఫియర్లెస్ బ్యాటింగ్ తీరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

Read Also:Vaibhav Suryavanshi: బుమ్రా అయినా.. హేజిల్‌వుడ్ అయినా లెక్క చేయను: వైభవ్

“మేమేం బాధపడటం లేదు” – భువనేశ్వర్ కుమార్ ప్రశంసలు

మ్యాచ్ అనంతరం ఆర్సీబీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, వైభవ్ ఇన్నింగ్స్‌ను అభినందించాడు. ఒక టీనేజర్ తన బౌలింగ్‌ను చితకబాదడంపై భువీ చాలా పరిణతితో స్పందించాడు.”ఇది టీ20 క్రికెట్.. ఇక్కడ వయసుతో సంబంధం లేదు. వైభవ్ చాలా చిన్నవాడైనప్పటికీ, క్రీజులో అతను చూపిస్తున్న మెచ్యూరిటీ ఆశ్చర్యం కలిగిస్తోంది. మమ్మల్ని ఒక 15 ఏళ్ల కుర్రాడు కొట్టాడని మేం అస్సలు బాధపడటం లేదు. అతను కేవలం బంతిని బలంగా బాదడమే కాకుండా, ప్రాపర్ క్రికెటింగ్ షాట్లతో అలరించాడు. ఈ విజయం, క్రెడిట్ మొత్తం అతనికే దక్కుతుంది.”

 Vaibhav Suryavanshi 78 off 26 balls

Bhuvneshwar Kumar on Vaibhav: ఆర్సీబీ వైఫల్యం.. వైభవ్ ఆధిపత్యం

ఈ మ్యాచ్‌లో 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు వైభవ్ పవర్‌ప్లేలోనే 97/1 స్కోరుతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లను ఏమాత్రం భయం లేకుండా ఎదుర్కొన్న తీరు హైలైట్‌గా నిలిచింది. పవర్‌ప్లేలో ఒక క్యాచ్ మిస్ అవ్వడం మరియు వైభవ్ విధ్వంసం వల్ల మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లోంచి జారిపోయిందని భువీ అంగీకరించాడు. రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

26 బంతుల్లో 78 రన్స్.. కోహ్లీ నుంచి స్పెషల్ గిఫ్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha