Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
26 బంతుల్లో 78 రన్స్.. కోహ్లీ నుంచి స్పెషల్ గిఫ్ట్!

26 బంతుల్లో 78 రన్స్.. కోహ్లీ నుంచి స్పెషల్ గిఫ్ట్!

వార్త 2 months ago

Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడి క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డులను తిరగరాశాడు.

కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు బాది రాజస్థాన్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో వైభవ్ ప్రస్తుత సీజన్‌లో ‘ఆరెంజ్ క్యాప్’ను దక్కించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయసులోనే ఆరెంజ్ క్యాప్ సాధించిన ఆటగాడిగా వైభవ్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

Read Also:Vaibhav Suryavanshi: బుమ్రా అయినా.. హేజిల్‌వుడ్ అయినా లెక్క చేయను: వైభవ్

 Orange Cap at a Very Young Age… Kohli Salutes Vaibhav’s Batting.

Vaibhav Suryavanshi: కోహ్లీ ఆటోగ్రాఫ్.. రాజస్థాన్ క్యాప్‌పై స్పెషల్ మెసేజ్

మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా దిగ్గజం విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా అభినందించారు. వైభవ్ బ్యాటింగ్ శైలికి ముగ్ధుడైన కోహ్లీ, అతడి రాజస్థాన్ రాయల్స్ క్యాప్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అంతేకాకుండా, ‘డియర్ వైభవ్, వెల్ డన్’ (Dear Vaibhav, Well Done) అని సందేశాన్ని రాసి ఆ యువ ఆటగాడిలో మరింత స్ఫూర్తిని నింపారు. ఒక లెజెండరీ ప్లేయర్ నుంచి ఇటువంటి ప్రశంస దక్కడం వైభవ్ కెరీర్‌కు పెద్ద ఊతం ఇస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రవి బిష్ణోయ్ గూగ్లీకి కోహ్లీ బలి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha