Dailyhunt
19 పేజీల టెకీ సీతారాం సూసైడ్ నోట్.. కళ్లు చెదిరే నిజాలు!

19 పేజీల టెకీ సీతారాం సూసైడ్ నోట్.. కళ్లు చెదిరే నిజాలు!

వార్త 1 week ago

Sitaram Suicide Case updates: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం ఆత్మహత్య కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చనిపోవడానికి ముందు ఆయన రాసిన 19 పేజీల కన్నీటి గాథ, ఒక సామాన్య భర్త తన భార్య వల్ల పడ్డ నరకాన్ని కళ్లకు కట్టింది.

ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాంకు, నంద్యాలకు చెందిన రేణుకతో 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, వీరి పచ్చని సంసారంలో రేణుక వివాహేతర సంబంధాలు చిచ్చు పోశాయి.

Read also: Anantapur crime: ఆరేళ్ల బాలిక గుండెపోటుతో మృతి!

 Techie Sitaram’s 19-page suicide note.. Eye-opening facts!

Sitaram Suicide Case updates: ఒకేసారి ముగ్గురితో ఎఫైర్.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు!

రేణుకకు పెళ్లయిన తర్వాత కూడా ముగ్గురితో అక్రమ సంబంధం ఉందని, పెళ్లికి ముందు ఆమెకు ఆరు ప్రేమకథలు ఉన్నాయని సీతారాం తన సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు వెల్లడించాడు. ఒక ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసిన రేణుక, వాటిని మరో ప్రియుడైన రమణారెడ్డికి షేర్ చేసింది. రమణారెడ్డి ఆ వీడియోలను ఏకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో సీతారాం పరువు బజార్న పడింది. వీడియోలు డిలీట్ చేయమని బ్రతిమాలినా రమణారెడ్డి వినకపోగా, పైశాచికంగా ప్రవర్తించాడు.

 Techie Sitaram’s 19-page suicide note.. Eye-opening facts!

Sitaram Suicide Case updates: పోలీసుల నిర్లక్ష్యం.. సీతారాం ఆవేదన

వీడియోల విషయమై పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. తాము పోలీస్ స్టేషన్‌లో ఉండగానే రమణారెడ్డి మళ్లీ వీడియోలను అప్‌లోడ్ చేశాడని, ఆ సమయంలో పోలీసులు కనీస చర్యలు తీసుకోలేదని సీతారాం ఆ లేఖలో వాపోయాడు. ఈ అవమానం తట్టుకోలేక రేణుక ఆత్మహత్యాయత్నం చేయడంతో, సీతారాం మానవత్వంతో ఆమెను కాపాడుకున్నాడు. రెండు నెలల తర్వాత మళ్లీ అన్నీ మర్చిపోయి కాపురానికి తెచ్చుకున్నాడు.

పసిబిడ్డను వదిలేసి.. స్కార్ఫ్ కట్టుకుని ప్రియుడి కోసం!

రెండవసారి అవకాశం ఇచ్చినా రేణుక మారలేదు. 30 నెలల పసిబిడ్డను ఇంట్లో వదిలేసి, ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని ఆటోల్లో తిరుగుతూ కొత్త సిమ్ కార్డు కోసం ప్రయత్నించిందని సీతారాం తెలుసుకున్నాడు. భార్య ఇప్పటికీ రమణారెడ్డి స్టేటస్‌లను ఫాలో అవుతోందని, ఆమె తనను నమ్మించి గొంతు కోసిందని గ్రహించిన సీతారాం.. ఇక బ్రతకడం వ్యర్థమని భావించాడు. తన పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకున్నానని, కానీ భార్య చేసిన ద్రోహాన్ని భరించలేక హుస్సేన్ సాగర్‌లో దూకి ప్రాణాలు వదిలాడు.

తల్లిదండ్రుల ఆవేదన.. నిందితుల అరెస్ట్‌లో జాప్యం

సీతారాం ఆత్మహత్య చేసుకొని మూడు నెలలు గడుస్తున్నా, ప్రధాన నిందితుడు రమణారెడ్డిని పట్టుకోవడంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని సీతారాం తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కొడుకు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ముగ్గురితో ఎఫైర్.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు.. టెకీ సీతారాం ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha