Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముగ్గురితో ఎఫైర్.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు.. టెకీ సీతారాం ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు!

ముగ్గురితో ఎఫైర్.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు.. టెకీ సీతారాం ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు!

వార్త 1 month ago

Software Engineer suicide: వివాహేతర సంబంధాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఒక అందమైన కుటుంబాన్ని రోడ్డున పడేశాయి. తన భార్య ముగ్గురు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుందనే నిజం తట్టుకోలేక, ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read also: Anantapur crime: ఆరేళ్ల బాలిక గుండెపోటుతో మృతి!

ఘటన వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకలకు 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీతారాం నెలకు రూ. 2 లక్షల జీతం సంపాదించే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ, తన కుటుంబాన్ని బాచుపల్లిలో స్థిరపరిచాడు. భార్యకు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు.

 Affair with three people.. Videos on Instagram.. Shocking facts in the suicide case of techie Sitaram!

నిజం తెలిసిందిలా..

సీతారాంకు తెలియకుండా రేణుక ఏడాదిన్నర కాలంగా ముగ్గురు వ్యక్తులతో వివాహేతర సంబంధాలు కొనసాగించింది. ఇందులో రమణారెడ్డి అనే వ్యక్తితో ఉన్న సమయంలో ఆమె కొన్ని ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసుకుంది. అయితే, సదరు ప్రియుడు రమణారెడ్డి ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో సీతారాంకు తన భార్య అసలు రూపం తెలిసింది.

Software Engineer suicide: గుండె కోతను మిగిల్చిన ఆవేదన

తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్‌లో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు రాసిన 19 పేజీల లేఖలో తన ఆవేదననంతా వెల్లగక్కాడు:

  1. “నేను నా భార్యకు ఏ లోటు రాకుండా చూసుకున్నాను, కానీ ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో సంబంధాలు పెట్టుకుంది.”
  2. “ఆమెకు నా నుండి ఏం కావాలో అర్థం కావడం లేదు.. ప్రేమనా లేక శృంగారమా?”
  3. “ఆ దారుణమైన వీడియోలు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆమె నాకు నమ్మకద్రోహం చేసింది.” అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు.

ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

సీతారాం రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గాను నిందితురాలు రేణుకతో పాటు, ఆమె ప్రియులు రమణారెడ్డి, శ్రవణ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉండి, నెలకు లక్షల్లో సంపాదించే వ్యక్తి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో అతని ఇద్దరు పిల్లలు అనాథలయ్యారని సీతారాం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

హైదరాబాద్‌లో పసిపిల్లల అమ్మకం ముఠా గుట్టురట్టు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha