Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2 ఏళ్ల వయస్సులోనే చెస్‌లో చరిత్ర సృష్టించిన శ్రేయాన్ష్ పటేల్!

2 ఏళ్ల వయస్సులోనే చెస్‌లో చరిత్ర సృష్టించిన శ్రేయాన్ష్ పటేల్!

వార్త 2 months ago

Konda Shreyansh World Record: తెలంగాణ రాష్ట్ర గడ్డపై మరో అద్భుత ప్రతిభ వెలుగులోకి వచ్చింది. కేవలం రెండు సంవత్సరాల 11 నెలల ప్రాయంలోనే కొండా శ్రేయాన్ష్ మురళీకృష్ణ పటేల్ చదరంగం (Chess) క్రీడలో అసాధారణ ప్రతిభ కనబరిచి, రెండు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే & ఎంపీల కాలనీ కల్చరల్ సెంటర్‌లో రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పోటీల్లో శ్రేయాన్ష్ ఈ ఘనత సాధించాడు.

Read Also: Ibrahimpatnam MPDO Office: ఎంపీడీఓ కార్యాలయంలో విజిలెన్స్ మెరుపు దాడులు

ఉప ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి సమక్షంలో రికార్డుల వేట

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. చిన్నారి శ్రేయాన్ష్ ప్రదర్శించిన ఏకాగ్రతను చూసి వారు అబ్బురపడ్డారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) ప్రతినిధుల సమక్షంలో శ్రేయాన్ష్ తన మేధస్సును నిరూపించుకున్నాడు.

Konda Shreyansh World Record: అసాధారణ రికార్డులు ఇవే..

శ్రేయాన్ష్ తన బుల్లి చేతులతో చదరంగం బోర్డుపై విన్యాసాలు చేస్తూ రెండు రికార్డులు నెలకొల్పాడు:

  1. బ్యాక్ ర్యాంక్ చెక్‌మేట్స్: కేవలం 15 నిమిషాల 52 సెకండ్లలోనే 93 బ్యాక్ ర్యాంక్ చెక్‌మేట్ పజిల్స్‌ను పరిష్కరించాడు.
  2. చెస్ బోర్డుల అమరిక: 1 గంట 9 నిమిషాల 9 సెకండ్లలో 21 చెస్ బోర్డులను పర్ఫెక్ట్‌గా అమర్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

బ్రిటిష్ పార్లమెంట్‌లో గౌరవం

ఈ అద్భుత విజయంతో శ్రేయాన్ష్ పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. త్వరలోనే లండన్‌లోని బ్రిటిష్ పార్లమెంట్‌లో శ్రేయాన్ష్‌కు సత్కారం మరియు సర్టిఫికేట్ అందజేయనున్నారు. ఇంత చిన్న వయస్సులో రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన శ్రేయాన్ష్‌కు డిప్యూటీ సీఎం మరియు క్రీడా మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

నిమ్స్ ఆధునిక కేన్సర్ చికిత్స యంత్రం ప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha