Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి

2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి

వార్త 2 months ago

Polavaram Diaphragm : ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన నీటి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముఖ్యమైన దశ పూర్తయిందని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu తెలిపారు.

ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1,372 మీటర్ల పొడవైన డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయిందని చెప్పారు.

ఇంజనీర్లకు అభినందనలు

ఈ పనిని తక్కువ సమయంలో పూర్తి చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజనీర్లను ముఖ్యమంత్రి అభినందించారు. అలాగే ఈ నిర్మాణంలో సహకరించిన కేంద్ర సంస్థలకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతినిధులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

గత పాలనపై విమర్శ

గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. దానిని మళ్లీ నిర్మించేందుకు అదనంగా సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

Read Also:Medchal Doctor Suicide: భార్య వేధింపులు భరించలేక..డాక్టర్ ఆత్మహత్య

 Polavaram Diaphragm

వేగం పెంచనున్న డ్యామ్ పనులు

డయాఫ్రం వాల్ పూర్తవడంతో ప్రధాన నిర్మాణమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు మరింత వేగవంతం అవుతాయని సీఎం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, సాగునీటి రంగానికి పెద్ద ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

2027 పుష్కరాల లక్ష్యం

ఇప్పటికే ప్రకటించినట్లు అన్ని పనులను పూర్తి చేసి 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బస్సు ప్రమాదం: 14 మంది మృతికి ఆ 'పిసినారితనమే' కారణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha