AP Bakrid Holiday Date: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సెలవు దినాన్ని మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా, ఈ నెల 28వ తేదీన బక్రీద్ ప్రభుత్వ సెలవు ఉంటుందని అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మార్పు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Also : Deloitte Campus : ఏపీలో డెలాయిట్ క్యాంపస్?
Bakrid holiday on 28th, not 27th
AP Bakrid Holiday Date: జీవో 1006 విడుదల
గతంలో ప్రభుత్వం విడుదల చేసిన వార్షిక క్యాలెండర్ ప్రకారం.. బక్రీద్ సెలవును ఈ నెల 27వ తేదీన ప్రకటించారు. అయితే, చంద్రదర్శనం ఆధారంగా పండుగ తేదీ మారడంతో, సెలవు రోజు ని కూడా మార్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యనిర్వాహణాధికారి CEO ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. వక్ఫ్ బోర్డు సీఈఓ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం, సెలవును 27కి బదులుగా 28కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో నెం. 1006 (GO 1006) విడుదల చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

