Dailyhunt
3,699 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సీజ్

3,699 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సీజ్

వార్త 1 week ago

Gas Black Market Raid: పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యం లో రాష్ట్రంలో గ్యాస్ బ్లాక్ మార్కెట్ దందాపై పౌరసరఫరాలశాఖ ఉక్కుపాదం మోపుతోంది.

నిత్యం తెలంగాణలో పౌరసరఫరాల శాఖ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. అక్రమ గ్యాస్ నిల్వలు, బ్లాక్లో విక్రయాలపై దాడులు కొనసాగుతున్నాయి. కమర్షియల్ అవసరాల కోసం గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లను వాడుతున్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై అధికారులు దాడులు నిర్వహించి సిలిండర్లను సీజ్ చేశారు.

Read Also:Karimnagar Crime: కవల పిల్లలను కడతేర్చిన కసాయి తండ్రి!

 Gas Black Market Raid: 3,699 domestic gas cylinders seized

ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు

గృహ, కమర్షియల్ గ్యాస్ బ్లాక్ మార్కెట్ అమ్మకాలు జరగకుండా పౌరసరఫరాలశాఖ ప్రత్యేక తనిఖీ చేపట్టింది. ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేసి నిజమైన లబ్దిదారులకే పంపిణీ జరిగేలా చర్యలు చేపడుతోంది.
డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు సోదాలు చేసి పలువురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. వంటింటి గ్యాస్ యాజమానులు కూడా అధిక ధరలకు విక్రయించాలని భావిస్తే ఉన్న గ్యాస్ కనెక్షన్ తొలగించాల్సి వస్తోందని పౌరసరఫరాల శాఖ హెచ్చరిస్తోంది.

Gas Black Market Raid: బ్లాక్ మార్కెట్ అమ్మకాలపై తనిఖీలు

మధ్య పాశ్చ దేశాలతో యుద్ధం కారణంగా గ్యాస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ కొరత లేకుండా చర్యలు చేపట్టారు. రాష్ట్ర పౌరసరఫరాల అధికారులు బ్లాక్ మార్కెట్ అమ్మకాలపై తనిఖీలు చేపట్టడంతో గత 12వ తేదీ నుంచి ఈ నెల 3వ తేదీ వరకు గృహ అవసరాలకు వినియోగించే 3699 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. 70 చిన్న సిలిండర్లను సీజ్ చేసినట్లు పౌరసరఫరాలశాఖ కమిషన్ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీజ్ చేసిన సిలిండర్ల విలువ రూ.1కోటి 10లక్షలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. గ్యాస్ అక్రమార్కులపై ఇపనపటి వరకు 1275 కేసులు నమోదు చేయగా 216మందిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

హైదరాబాద్‌లో భారీగా 'కెమికల్' మామిడి పండ్లు సీజ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha