Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
44° దాటిన ఒంటిమిట్ట, కంభం.. 16 జిల్లాల్లో 42°కి పైగా ఉష్ణోగ్రతలు

44° దాటిన ఒంటిమిట్ట, కంభం.. 16 జిల్లాల్లో 42°కి పైగా ఉష్ణోగ్రతలు

వార్త 1 month ago

AP Weather updates: రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొని ఉంది. ఎండలు మండుతుంటే, మరో పక్క బంగాళా ద్రోణి ప్రభావంతో పలుజిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.

మంగళవారం మార్కాపురం జిల్లా కంభం, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్లైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు గాను 16 జిల్లాల పరిధిలోని 140 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు.

Read also: Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్షాల బీభత్సం

 AP Weather Heatwave and Rain Alert 2026

AP Weather updates: వివిధ జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.1 డిగ్రీలు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 43.8 డిగ్రీలు, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 43.6 ది, పల్నాడు జిల్లా గురజాలలో 43.2 ది, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 42.8 డిగ్రీలు అనంతపురం(జి) రాయదుర్గంలో 42.4 ది, కాకినాడ జిల్లా కరపలో 42.3 ది, కర్నూలు జిల్లా నగరడోనలో 42.2 ది, అన్నమయ్య జిల్లా గాలివీడు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.1 చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.

వడగాల్పుల హెచ్చరిక

ఇక బుధవారం అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం, పార్వతీపురమన్యం జిల్లాల్లోని 21 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 7 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే మండలాలు: విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, మెరకముడిదాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో తీవ్రవడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు.

వర్ష సూచన, జాగ్రత్తలు

మరోవైపు రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమొరిన్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో బుధవారం మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మార్కాపురంలో వర్ష బీభత్సం.. బోడపాడులో ముగ్గురు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha