Dailyhunt
5 ఏళ్లకు బదులుగా 4.5 సంవత్సరాలకే ట్యూషన్ ఫీజులు

5 ఏళ్లకు బదులుగా 4.5 సంవత్సరాలకే ట్యూషన్ ఫీజులు

వార్త 5 days ago

ఎన్నారై ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట

Tirupati Swims Medical College : తిరుపతిలోని స్విమ్స్ (SVIMS) అనుబంధ శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో చదువుతున్న ఎన్నారై ఎంబీబీఎస్ విద్యార్థులకు టీటీడీ ఊరట కల్పించింది.

ఇకపై ఐదేళ్లకు బదులుగా నాలుగున్నర సంవత్సరాలకే ట్యూషన్ ఫీజులు వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విద్యార్థులపై పడుతున్న ఫీజుల భారం తగ్గనుంది.

విద్యార్థుల విజ్ఞప్తి

శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితి 4.5 సంవత్సరాలు మాత్రమే. అయితే ఇప్పటివరకు యాజమాన్యం 5 సంవత్సరాల పాటు ఫీజులు వసూలు చేస్తోంది. దీంతో 2021-22 బ్యాచ్ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఇటీవల టీటీడీ ఈవో ఎం. రవిచంద్రను కలిసి విజ్ఞప్తి చేశారు. కోర్సు కాలపరిమితి మేరకే ఫీజులు వసూలు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం నిర్ణయం

విద్యార్థుల అభ్యర్థనపై స్పందించిన టీటీడీ ఈవో, జాతీయ వైద్య కమిషన్ (NMC) ఈ నెల 7న జారీ చేసిన నిబంధనలను పరిశీలించారు. దీని ప్రకారం ఎన్నారై కోటా ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి నాలుగున్నర సంవత్సరాలకే ఫీజులు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Read Also : BJP vs Congress: తేజస్వి సూర్య వ్యాఖ్యలపై పొన్నం ఆగ్రహం.. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

 Tirupati Swims Medical College

భవిష్యత్ బ్యాచ్‌లకు కూడా వర్తింపు

ప్రస్తుతం 2021-22 బ్యాచ్ విద్యార్థులు చివరి సంవత్సరంలో ఉండటంతో ఈ నిర్ణయం వారికి తక్షణమే వర్తించనుంది. అలాగే భవిష్యత్తులో వచ్చే బ్యాచ్‌లకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదం పొందేందుకు త్వరలో స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో ఉంచనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఎన్డీయేకు మహిళ 'ఓట్ల వర్షం' కురిపిస్తుందా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha