Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
5 మిత్రదేశాలకు హర్మూజ్ జలసంధి పర్మిషన్..మనకు గుడ్‌న్యూస్ యేనా!

5 మిత్రదేశాలకు హర్మూజ్ జలసంధి పర్మిషన్..మనకు గుడ్‌న్యూస్ యేనా!

వార్త 3 months ago

అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి' (Strait of Hormuz) గుండా భారత నౌకల రాకపోకలకు లైన్ క్లియర్ అయ్యింది. భారత్‌తో పాటు మరో నాలుగు మిత్ర దేశాలకు చెందిన నౌకలను తమ జలసంధి గుండా అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సంచలన ప్రకటన చేశారు.

ఈ విషయాన్ని ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం అధికారికంగా Xలో తెలిపింది. భారత్‌కు ఇరాన్ ప్రాధాన్యత ఇవ్వడం దౌత్యపరంగా కీలక పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: Maharashtra Council Verdict: ఎమ్మెల్యేపై ఫేక్ న్యూస్ ప్రచారం.. యువకుడికి 5 రోజుల జైలు శిక్ష

 Iran War

Iran War: చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్థాన్‌లను తమ అత్యంత ఆప్త మిత్ర దేశాలు

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించిన వివరాల ప్రకారం.. చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్థాన్‌లను తమ అత్యంత ఆప్త మిత్ర దేశాలుగా ఇరాన్ గుర్తించింది. ఈ ఐదు దేశాల నౌకలకు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ఎటువంటి ఆటంకాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న అంతర్జాతీయ దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వని దేశాలకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఇరాన్ గుర్తుచేసింది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో గత కొంతకాలంగా హర్మూజ్ జలసంధికి ఇరువైపులా నిలిచిపోయిన భారత నౌకలకు మార్గం సుగమమైంది. ముఖ్యంగా గ్యాస్ ట్యాంకర్లు, ఇతర నిత్యావసర సరకులతో ఉన్న ఐదు భారీ నౌకలు ఇప్పటికే అనుమతుల కోసం వేచి చూస్తున్నాయి. ఇరాన్ తాజా ప్రకటనతో ఈ నౌకలు క్షేమంగా భారత తీరానికి చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలో ఇంధన సరఫరా, వాణిజ్య కార్యకలాపాలకు ఊతం లభించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మార్కాపురం మృతులకు ప్రధాని మోదీ సంతాపం.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha