Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మార్కాపురం మృతులకు ప్రధాని మోదీ సంతాపం.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మార్కాపురం మృతులకు ప్రధాని మోదీ సంతాపం.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

వార్త 3 months ago

PMNRF: మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. మృతుల సంఖ్య 13కు చేరడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు భరోసాగా పీఎంఎన్ఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 27 మంది గాయపడ్డారు.

Read Also:Markapuram Bus Accident Helpline Numbers: మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు.. వీటిని సంప్రదించండి!

ప్రధానమంత్రి ప్రకటించిన ఆర్థిక సాయం

ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడినవారికి రూ. 50 వేల చొప్పున సాయం అందించనున్నట్టుగా తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

 PM Narendra Modi Ex-gratia Markapuram Bus Accident

''ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరం. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తాం. గాయపడిన వారికి రూ. 50,000 ఇవ్వబడుతుంది'' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆలయాల పవిత్రతను రక్షిస్తాం: పవన్ కల్యాణ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha