Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
50 వసంతాల 'మాజా' మ్యాంగో!

50 వసంతాల 'మాజా' మ్యాంగో!

వార్త 3 days ago

Maaza : భారతీయులకు మామిడి పండు అంటే కేవలం ఒక ఫలం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్, చిన్ననాటి జ్ఞాపకాల సమాహారం. అలాంటి అసలైన మామిడి రుచిని అందిస్తూ కోకా-కోలా ఇండియాకు చెందిన ప్రతిష్టాత్మక బ్రాండ్ 'మాజా®' (Maaza) 2026 మే నాటికి విజయవంతంగా 50 వసంతాల మైలురాయిని పూర్తి చేసుకుంది.

1976లో ప్రారంభమైన ఈ స్వదేశీ బ్రాండ్, ఐదు దశాబ్దాలుగా తరాల పొడుగునా ప్రతి భారతీయ కుటుంబంలో ఒక భాగంగా మారిపోయింది. వేసవి సెలవుల మధ్యాహ్నాలు, పండుగ విందులు, ఆదివారం భోజనాల తర్వాత తినే డెజర్ట్‌ల నుండి చిన్న చిన్న రోజువారీ ఆనందాల వరకు మాజా ఒక సుపరిచితమైన తోడుగా నిలిచింది. 'తాజా మ్యాంగో, మాజా® మ్యాంగో' మరియు 'మాజా® హో జాయే' వంటి ఐకానిక్ క్యాంపెయిన్ల ద్వారా ప్రజల హృదయాలకు కనెక్ట్ అయిన ఈ బ్రాండ్, కేవలం ఒక పానీయంగానే కాకుండా, భారతీయుల సాంస్కృతిక జీవనశైలితో మరియు భావోద్వేగాలతో గాఢమైన బంధాన్ని నిర్మించుకుందని కోకా-కోలా ఇండియా మరియు ఓగిల్వీ ఇండియా ప్రతినిధులు స్పష్టం చేశారు.

Read Also : ముంబైలో పావ్ ధరల పెంపు.. సామాన్యుడి అల్పాహారానికి ఇక చుక్కలే!

తోట నుండి గ్లాసు వరకు: ‘ప్రాజెక్ట్ ఉన్నతి’తో రైతన్నల జీవితాల్లో వెలుగులు

మాజా సాధించిన ఈ అర్థ శతాబ్దపు ఘన విజయం కేవలం మార్కెటింగ్ వ్యూహాలకే పరిమితం కాలేదు; దీని వెనుక దేశంలోని లక్షలాది మంది మామిడి రైతుల శ్రమ దాగి ఉంది. కోకా-కోలా ఇండియా చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఉన్నతి’ (Project Unnati) ద్వారా భారతదేశ మామిడి సాగు వ్యవస్థను సంస్థ మరింత బలోపేతం చేసింది. ఈ ప్రాజెక్ట్ కింద వివిధ రాష్ట్రాల్లోని పండ్ల రైతులకు ‘అల్ట్రా-హై-డెన్సిటీ ప్లాంటేషన్’ (అత్యధిక సాంద్రత కలిగిన తోటల పెంపకం), డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) వంటి ఆధునిక, సుస్థిర వ్యవసాయ పద్ధతులను పరిచయం చేశారు. ఇది పండ్ల నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా, ఎకరాకు దిగుబడిని పెంచి రైతుల ఆదాయ వృద్ధికి ఎంతగానో తోడ్పడింది. తన తదుపరి అర్థ శతాబ్దపు ప్రయాణంలోకి అడుగుపెడుతున్న వేళ, మాజా తన మూల గుర్తింపును మరియు నమ్మకాన్ని కాపాడుకుంటూ, భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్న మరిన్ని మధుర క్షణాలను అందించడానికి కట్టుబడి ఉందని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha