Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
6G సాంకేతికతలో భారత్ సంచలన అడుగు: గ్లోబల్ కూటమిలో చేరిక

6G సాంకేతికతలో భారత్ సంచలన అడుగు: గ్లోబల్ కూటమిలో చేరిక

వార్త 1 week ago

India Joins US 6G Initiative : ప్రపంచవ్యాప్తంగా నెక్ట్స్ జనరేషన్ టెలికాం సాంకేతికతను శాసించేందుకు భారత్ మరో కీలక అడుగు వేసింది. వేగవంతమైన, సురక్షితమైన 6G వైర్‌లెస్ నెట్‌వర్క్ అభివృద్ధి కోసం అమెరికా ప్రారంభించిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ భాగస్వామ్య (Global Partnership) కూటమిలో భారత్ అధికారికంగా భాగస్వామిగా చేరింది.

అమెరికా ప్రారంభించిన ఈ 6G ఇనిషియేటివ్‌లో భారత్‌తో పాటు యూకే, జర్మనీ, జపాన్ వంటి కీలక దేశాలు సహా మొత్తం 26 దేశాలు చేరాయి.2030 నాటికి 5G స్థానంలో 6G నెట్‌వర్క్ రానుంది. ఈ క్రమంలో సభ్య దేశాల డిజిటల్ భద్రతా ప్రయోజనాలను కాపాడటం, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలను వేగవంతం చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ధ్యేయం. అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ‘నేషనల్ టెలీకమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్’ (NTIA) ఈ కూటమికి నాయకత్వం వహిస్తోంది.

Read Also: Abhishek Banerjee: అభిషేక్ బెనర్జీకి హైకోర్టు హెచ్చరిక.. పార్టీ కార్యాలయం కూల్చివేతపై స్టే ఎత్తివేస్తాం!

 India Joins US 6G Initiative

India Joins US 6G Initiative : ఉన్నత స్థాయి చర్చలు - జీ20 వేదికగా ముందడుగు

నార్త్ కరోలినాలో జరిగిన జీ20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సమావేశం సైడ్‌లైన్స్‌లో అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్, భారత వాణిజ్య శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద సమావేశమై 6G నెట్‌వర్క్ అభివృద్ధిపై కీలక చర్చలు జరిపారు. ఈ 26 దేశాల ఉమ్మడి ప్రయత్నం ప్రపంచ డిజిటల్ రంగానికే ఒక కొత్త దిశను నిర్దేశిస్తుందని జితిన్ ప్రసాద స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్చి 2023లోనే ‘భారత్ 6G విజన్ డాక్యుమెంట్’ను ఆవిష్కరించారు. 6G నెట్‌వర్క్ డిజైన్, పరిశోధన మరియు అమలులో 2030 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా (Global Leader) నిలబెట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. 6G నెట్‌వర్క్ అభివృద్ధి, విస్తరణకు సంబంధించి భారత్ ఇప్పటికే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2023, మార్చి 22న ప్రత్యేకంగా ఇండియా 6G విజన్ డాక్యుమెంట్‌ను కూడా ఆవిష్కరించారు. 6G డిజైన్ సహా అభివృద్ధి చేయడం, అమలు చేయడంలో భారత్ 2030 నాటికి ప్రపంచంలో గ్లోబల్ లీడర్‌గా ఎదగడం ఈ విజన్ ప్రధాన లక్ష్యం.

ఒడిశా అడవుల్లో అరుదైన వానరాలు..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha