Dailyhunt
ఏపీ క్యాబినెట్ సమావేశంలోని ముఖ్యాంశాలు ఇవే!

ఏపీ క్యాబినెట్ సమావేశంలోని ముఖ్యాంశాలు ఇవే!

వార్త 1 week ago

AP Cabinet Meeting Updates: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం రాష్ట్ర అభివృద్ధి, ప్రస్తుత రాజకీయ అంశాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ భేటీలో ప్రధానంగా రాజధాని అమరావతి పనులు, భూకేటాయింపులు, ప్రతిపక్షాల విమర్శలపై చర్చించారు.

Read Also: AP Politics: అమరావతి పనులా లేక ప్రజల కష్టాలా?: షర్మిల

క్యాబినెట్ సమావేశం – ప్రధాన నిర్ణయాలు

  • అమరావతి అభివృద్ధి: రాజధాని అమరావతి ప్రాంతంలో నిలిచిపోయిన పలు నిర్మాణ పనులకు సంబంధించి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
  • భూకేటాయింపులు: రాజధాని అభివృద్ధిలో భాగంగా వివిధ సంస్థలకు భూములు కేటాయించే అంశంపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు.
  • పెట్టుబడుల ఆకర్షణ: రాజధాని నిర్మాణంలో వేగం పెంచడంతో పాటు, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా కీలక ప్రాజెక్టులపై మంత్రులు చర్చించారు.

 AP Cabinet Decisions

AP Cabinet Meeting Updates: రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం

అజెండా పూర్తయిన తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

  • వైసీపీ విమర్శల తిప్పికొట్టాలి: అమరావతి నిర్మాణ ఖర్చులపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించాలని, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
  • ఇంధన సమస్యపై వివరణ: రాష్ట్రంలో తలెత్తిన ఇంధన కొరతపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు ప్రచారాల వల్లే ప్రజలు ఆందోళనతో ఎక్కువ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేశారని, ఆ విషయాన్ని వివరించాలన్నారు.
  • సింగపూర్ పర్యటన: మంత్రుల సింగపూర్ పర్యటనపై ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని, పాలనలో సంస్కరణల కోసమే ఈ శిక్షణ అని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

టెన్త్ ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha