Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
73 మండలాల్లో నేడు తీవ్ర వడగాడ్పులు

73 మండలాల్లో నేడు తీవ్ర వడగాడ్పులు

వార్త 4 months ago

AP Heatwave Alert: రాష్ట్రo లోని 73మండలాల్లో శనివారం తీవ్ర వడగాల్పులు, 17 మం డలాల్లో వడగాల్పులు, ఆదివారం 32మం డలాల్లో తీవ్ర వడగాలులు, 21మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఎండ తీవ్రత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read Also: Vijaya Milk Price Hike: విజయ పాలు రూ.2 పెంపు పెరుగు బకెట్లపై రూ.30 హెచ్చింపు

 Severe Heatwave Warning for 73 Mandals

AP Heatwave Alert: జిల్లా వారీగా వడగాడ్పుల ప్రభావం

శనివారం శ్రీకాకుళం జిల్లాలో 16, విజయ నగరం 24, పార్వతీపురం మన్యం 15, అల్లూరి 3, పోలవరం 9, అనకాపల్లి 2, కాకినాడ 3, తూర్పు గోదావరి 1 తీవ్ర వడ గాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం 2, పోలవరం 2, అనకాపల్లి 1, కాకినాడ2, తూర్పు గోదావరి 3, ఏలూరు 4, ఎన్టీఆర్ 1, పల్నాడు 2 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.

ప్రజలకు సూచనలు

శుక్రవారం మన్యం భామినిలో 41.8డిగ్రీలు, చిత్తూరు రాయలపేటలో 41.4, అనకాపల్లి నాతవరంలో 40.9, శ్రీకాకుళం జి.సిగడాంలో 40.5, నంద్యాల ఆలమూరు, కడప బద్వేల్లో 40.4, ఏలూరు ధర్మాజీగూడేం, తిరుపతి రేణిగుంట, విజయనగరం రాజాంలో 40.3, కృష్ణ కంకిపాడులో 40.1, కర్నూలు తోవి 40 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

వడగాలులు వీస్తున్నందున మహిళలు, పిల్లలు, వృద్ధులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్,ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ ఎక్కువగా తీసుకోవాలన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AP New Map 28 Districts: అమరావతి రాజధానిగా నూతన మ్యాప్ విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha