Dailyhunt
76 మంది విద్యా శాఖ సిబ్బందికి షోకాజ్ నోటీసులు

76 మంది విద్యా శాఖ సిబ్బందికి షోకాజ్ నోటీసులు

వార్త 0 months ago

Gadwal: గద్వాల జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశా లల్లో ఎఫ్.ఆర్.ఎస్ (ఫేస్ రికగ్నైజ్ సిస్టం) హాజరు విధానం సక్రమంగా నిర్వ హించక పోవడం వలన 76 మంది విద్యాశాఖ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అమలవుతున్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ హాజరు నమోదుపై సమగ్రంగా పరిశీలించగా, పలుచోట్ల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఎఫ్.ఆర్.ఎస్ యాప్ లో హాజరు సక్రమంగా నమోదు చేయకపోవడం గమనించారు.

Read Also: Harish Rao: రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోవద్దు

 Gadwal: Show cause notices issued to 76 education department staff

కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ

ఈ నేపథ్యంలోనే కలెక్టర్ జిల్లా పరిధిలోని 61 పాఠశాలలకు చెందిన 76 మంది బోధన, బోధనేతర సిబ్బందిపై చర్యలు తీసుకుంటూ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. సంబంధిత సిబ్బంది తమ సంజాయిషీని మూడు రోజుల లోపు సమర్పించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలను కచ్చితంగా పాటించడంతో పాటు, ప్రతి రోజూ ఎఫ్.ఆర్. ఎస్ ద్వారా హాజరును తప్పనిసరిగా సమయానికి నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి నిరక్ష పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు. జిల్లాలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

విద్యుత్ షాక్తో మరణిస్తే రూ.8 లక్షలకు పరిహారం పెంపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha