Telangana: ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసానిచ్చేందుకు ప్రస్తుతం ఇస్తున్న పరిహారాన్ని పెంచుతూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ నిర్ణయించింది.
ప్రస్తుతం విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని అందిస్తుండగా, దానికి అదనంగా మరో రూ.3 లక్షలు పెంచింది. దీంతో కరెంట్ షాక్తో చనిపోయిన కుటుంబాలకు రూ.8లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ పెంపు ఈ నెల నుంచి అమల్లోకి రావాలని ఆదేశించింది. ఇది బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించనుంది.
Read Also: Harish Rao: రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోవద్దు
Telangana: Compensation increased to Rs. 8 lakh in case of death due to electric shock
విద్యుత్ నియంత్రణ కమిషన్ స్పష్టం
ఈ పెంపును ఈ నెల నుంచి అమల్లోకి తీసుకురావాలని డిస్కంలకు సూచించినట్టు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ స్పష్టం చేసింది. వినియోగదారుల పొరపాటు వల్ల ప్రమాదం జరిగినా ఇవే నిబంధన వర్తిస్తాయని పేర్కొంది. ప్రమాదం జరిగిన రెండు నెలల్లోనే బాధితులకు పరిహారం అందేలా చూడాలని, లేని పక్షంలో డిస్కంలు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా గతంలో అనుమతించిన దానికన్నా వ్యయం రూ.7,635 కోట్ల అదనంగా పెరిగడంతో ట్రూ అప్ ఛార్జీలకు విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆమోదం తెలిపింది. అయితే ఈ డబ్బును కరెంటు బిల్లుల వసూళ్ల ద్వారా తీసుకోవద్దని తామే నిర్ణయం తీసుకుని తర్వాత చెపుతామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతు డిస్కం ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అది ముగిసేంత వరకు ట్రూ అప్ ఛార్జీలపై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు ఈఆర్సీ స్పష్టం చేసింది. పర్మిషన్ తీసుకున్న లోడుకన్నా ఎక్కువ కరెంటును యూజ్ చేసే హైటెన్షన్ వినియోగదారుల నుంచి అదనపు సొమ్ము వసూలు చేయడాన్ని సమర్థించినప్పటికీ, దీనిపై వాళ్లకు ఎలాంటి అవగాహన కల్పించకుండా అమల్లోకి తెచ్చినందున తొలి 2 నెలలు వసూలు చేసిన అదనపు బిల్లును తిరిగివ్వాలని డిస్కంలను ఆదేశించింది. రాబోయే 6 నెలల బిల్లుల్లో ఆ మొత్తాన్ని క్లియర్ చేయాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ స్పష్టం చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

