Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
9వ తరగతి బాలిక గర్భవతిగా గుర్తింపు.. ట్యూటర్ అరెస్ట్

9వ తరగతి బాలిక గర్భవతిగా గుర్తింపు.. ట్యూటర్ అరెస్ట్

వార్త 3 weeks ago

Minor Assault Case Odisha: ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఒక విచారకరమైన ఘటన వెలుగు చూసింది. స్థానిక రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ విద్యార్థిని ఐదు నెలల గర్భవతిగా తేలడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రైవేట్ ట్యూటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పాఠశాల యాజమాన్యం ఈ వారం నిర్వహించిన రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగా విద్యార్థినులకు సాధారణ వైద్య పరీక్షలు చేపట్టారు. ఈ క్రమంలో సదరు బాలిక ఐదు నెలల గర్భవతి అని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. విషయం తెలుసుకున్న పాఠశాల అధికారులు వెంటనే బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

Read Also : Madhya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్‌ రాజ్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

 9th-grade girl found pregnant; tutor arrested.

Minor Assault Case Odisha: వేసవి సెలవుల్లో ఇంటి వద్ద వేధింపులు

పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు బాలికను ఇంటికి తీసుకెళ్లి ఆప్యాయంగా ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వేసవి సెలవుల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనకు ట్యూషన్ చెప్పేందుకు వచ్చిన ప్రైవేట్ ట్యూటర్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. ఈ విషయాన్ని ఎవరికైనా బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించడంతో భయపడి ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నట్లు వివరించింది.

పోలీసుల ఎఫ్‌ఐఆర్, నిందితుడి అరెస్ట్

బాలిక చెప్పిన సమాచారంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి శుక్రవారం సదరు ప్రైవేట్ ట్యూటర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చట్టపరమైన తదుపరి చర్యలు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.

మధురాంతకంలో టైర్ పేలి కారు పల్టీ, నలుగురు విద్యార్థులు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha