Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ భయం నుంచి బయటపడ్డా.. 'మైసా' కోసం రష్మిక కష్టాలు

ఆ భయం నుంచి బయటపడ్డా.. 'మైసా' కోసం రష్మిక కష్టాలు

వార్త 1 week ago

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని మరోసారి చాటుకున్నారు. ప్రస్తుతం కొచ్చిలో జరుగుతున్న 'మైసా' చిత్ర షూటింగ్‌లో ఆమె ఒక అసాధారణ సాహసం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Read Also : Karuppu Movie: 'కరుప్పు' రిలీజ్‌కు బ్రేక్: చివరి నిమిషంలో షోలు రద్దు.. కారణం ఇదే!

 Dedication in the shooting of ‘Maisa’

Rashmika Mandanna: 'మైసా' కోసం రష్మిక కష్టాలు

రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మైసా’ చిత్రంలో ఒక కీలక సన్నివేశం కోసం రష్మిక డూప్ లేకుండా నటించాలని నిర్ణయించుకున్నారు. తనకు ఎంతో కాలంగా ఉన్న ‘ఎత్తుల భయాన్ని’అధిగమించి సుమారు 80 అడుగుల ఎత్తు నుండి ఆమె దూకారు. ఈ సాహసం చేస్తున్న క్రమంలో రష్మిక చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అయినప్పటికీ షూటింగ్‌కు అంతరాయం కలగకుండా ఆమె తన పనిని కొనసాగించారు. అడవులు, ట్రెక్కింగ్‌లు వర్షాల మధ్య జరుగుతున్న ఈ షూటింగ్ తనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆమె సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.

అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం కఠినమైన శిక్షణ తీసుకున్నానని, షూటింగ్ సమయంలో మోకాళ్లు, కాళ్లకు గాయాలైనా ఆపకుండా పని కొనసాగించానని తెలిపింది. ఉదయం అలారం పెట్టుకుని లేవడం నుంచి, కోచిలో ఫేమస్ అయిన పజం పోరి తినడం వరకు ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని రష్మిక తన అనుభవాలను పంచుకుంది.

విజయ్ – రష్మిక జోడీ ప్రపంచ రికార్డు

కేవలం వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ రష్మిక – విజయ్ దేవరకొండ జోడీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరిద్దరూ కలిసి నటించిన వాణిజ్య ప్రకటనలు ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

వీరిద్దరూ కలిసి నటించిన ఒక యాడ్ 9.1 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లైక్స్ పొందిన రెండో ప్రకటనగా నిలిచింది. ఈ జాబితాలో 11.5 మిలియన్ల లైక్స్‌తో మొదటి స్థానంలో ఉన్న యాడ్ కూడా ఈ జోడీకి సంబంధించినదే కావడం గమనార్హం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కుర్రాళ్ళు తెగ పాడుకుంటున్న పాట ఇదేనట!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha