Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ విజయం నా మామగారికి అంకితం: రింకూ సింగ్ కు కాబోయే భార్య

ఆ విజయం నా మామగారికి అంకితం: రింకూ సింగ్ కు కాబోయే భార్య

వార్త 1 month ago

KKR vs LSG: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ మరోసారి తన బ్యాట్‌తో మ్యాజిక్ చేశారు.

లక్నో సూపర్ జెయింట్స్‌పై జట్టును విజయపథంలో నడిపించిన రింకూ ప్రదర్శన ఒకెత్తయితే, మ్యాచ్ అనంతరం ఆయనకు కాబోయే భార్య ప్రియా సరోజ్ పంచుకున్న మాటలు ఇప్పుడు క్రికెట్ అభిమానుల కళ్లు చెమ్మగిల్లేలా చేస్తున్నాయి.

Read Also:Mohsin Khan : మొహ్సిన్ ఖాన్ పంజా.. కుప్పకూలిన కేకేఆర్

విజయ కేతనం.. మనసు నిండా విషాదం

ఎకానా స్టేడియంలో జరిగిన ఈ పోరాటంలో రింకూ సింగ్ పరుగుల సునామీ సృష్టించి కేకేఆర్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అయితే ఈ ఆనంద సమయానా రింకూ తండ్రి ఖాంచంద్ సింగ్ భౌతికంగా అక్కడ లేకపోవడం ఆ కుటుంబాన్ని కలిచివేసింది.కేకేఆర్ విడుదల చేసిన వీడియోలో ప్రియా మాట్లాడుతూ.. “రింకూ ఆడిన ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ నా మామగారికి అంకితం.

ఈ విజయాన్ని చూసి ఆయన ఎంతో మురిసిపోయేవారు. మేమందరం ఆయన్ని చాలా మిస్ అవుతున్నాం” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.రింకూ తండ్రి ఖాంచంద్ సింగ్ గత ఫిబ్రవరిలో లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారు. తన ఎదుగుదల కోసం ఎంతో శ్రమించిన తండ్రిని కోల్పోయిన బాధను గుండెల్లో దాచుకుని, రింకూ మైదానంలో పట్టుదలతో ఆడుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

KKR vs LSG: తండ్రి కల కోసం..

రింకూ సింగ్ సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్టార్ ప్లేయర్‌గా ఎదిగిన ప్రయాణంలో ఆయన తండ్రి పాత్ర ఎంతో ఉంది. గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేస్తూ కుమారుడిని క్రికెటర్ చేసిన తండ్రికి, ఈ ఐపీఎల్ ఇన్నింగ్స్ ద్వారా రింకూ ఘనమైన నివాళి అర్పించాడని అభిమానులు కొనియాడుతున్నారు.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు “స్టే స్ట్రాంగ్ రింకూ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఇంతటి విషాదం ఉన్నప్పటికీ ప్రొఫెషనల్‌గా జట్టును గెలిపించడం అతనిలోని క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని ఫ్యాన్స్ సెల్యూట్ చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఢిల్లీ వీధుల్లో ఆర్‌సీబీ ప్లేయర్స్ షికారు.. గల్లీలో బ్యాట్ పట్టిన విదేశీ స్టార్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha