Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్‌లో వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్‌లో వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వార్త 7 hrs ago

Victory Venkatesh: కాలేజీ రోజులు జీవితంలో అత్యంత మధురమైనవని, ఆ 3-4 సంవత్సరాల కాలేజీ జీవితాన్ని విద్యార్థులు పూర్తిస్థాయిలో ఆస్వాదించాలని విక్టరీ వెంకటేష్ సూచించారు.

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకకు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఆయన మాట్లాడిన మాటలు, విద్యార్థులకు ఇచ్చిన సలహాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Rajamouli : హాలీవుడ్ లో సినిమా చేయాలనీ ఉంది - రాజమౌళి

 Venkatesh makes interesting comments at the ‘Adarsha Kutumbam’ trailer launch

Victory Venkatesh: క్లాసులు బంక్ కొట్టడం వల్లే నాకు మంచి ఐడియాలు వచ్చాయి

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వెంకటేష్ మాట్లాడుతూ సరదా వ్యాఖ్యలు చేశారు. “చదువుకునే రోజులు మళ్లీ మళ్లీ తిరిగిరావు. అందుకే చదువుతో పాటు కాలేజీ లైఫ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయాలి. అప్పుడప్పుడు క్లాసులు బంక్ కొట్టడం కూడా అవసరమే! నిజానికి నేను అలా క్లాసులు బంక్ కొట్టడం వల్లే నాకు జీవితంలో చాలా మంచి ఐడియాలు వచ్చాయి” అని సరదాగా చెప్పడంతో అక్కడ ఉన్న విద్యార్థులంతా కేరింతలతో సందడి చేశారు.

చదువుతో పాటు ‘క్యారెక్టర్’ ముఖ్యం!

కేవలం వినోదాత్మక వ్యాఖ్యలకే పరిమితం కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విలువైన సందేశాన్ని కూడా వెంకటేష్ ఇచ్చారు. జీవితంలో మార్కులు, చదువు ఎంత ముఖ్యమో.. మంచి వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్‌ను పెంపొందించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. క్రమశిక్షణ, మంచి ప్రవర్తన ఉన్నప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలరని విద్యార్థులకు హితవు పలికారు.

Epaper: epaper.vaartha.com

ప్రభాస్ 'ఫౌజీ' అధికారిక గ్లింప్స్ విడుదల.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha