Indiramma Illu Scheme:తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆర్థిక సాయం అందించే ప్రక్రియలో ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది.
ఈ ప్రత్యేక విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెండున్నర లక్షల మంది అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ అయ్యాయి. ప్రభుత్వ నిధులు ఎటువంటి జాప్యం లేకుండా నేరుగా ప్రజలకు చేరడంలో ఈ విధానం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది.
Read also: Chicken Price : చికెన్ ప్రియులకు భారీ షాక్ ?
Indiramma Illu Scheme
సాంకేతిక సమస్యలకు చెక్ పెట్టిన ఆధార్ విధానం
గతంలో లబ్ధిదారులు అందించిన సాధారణ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాకపోవడం, ఖాతాలు వాడకంలో లేకపోవడం లేదా నిధులు నిలిచిపోవడం వంటి అనేక సమస్యలు ఎదురయ్యేవి. ఈ అడ్డంకులను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం ఆధార్ తో అనుసంధానమైన బ్యాంకు లేదా పోస్టల్ ఖాతాలను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ ఆర్థిక సాయం పూర్తి స్థాయిలో అందుతోంది.
Indiramma Illu Scheme:రూ. 6800 కోట్ల నిధులు జమ చేసిన ప్రభుత్వం
ఈ పకడ్బంది విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం రూ. 6,800 కోట్ల భారీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు విజయవంతంగా బదిలీ చేసింది. ఇల్లు నిర్మించుకుంటున్న పేద కుటుంబాలకు ఈ సాయం ఆర్థికంగా ఎంతో భరోసానిస్తోంది. ఎలాంటి అంతరాయాలు లేకుండా పారదర్శకంగా సాగుతున్న ఈ చెల్లింపుల తీరు ప్రజల్లో హర్షాతిరేకాలను వ్యక్తంచేస్తోంది.
Epaper: epaper.vaartha.com

