Childbirth : సాధ్యమైనంతగా ఎక్కువ మంది పిల్లల్ని కని, భారత దేశ జనాభా శాతం పడిపోకుండా రాజ్యతంత్రం నడపాలని ఢిల్లీ పెద్దల ప్రస్తుత ఆలోచనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
ఒక మెట్టు పైకెక్కి ప్రోత్సాహక నగదు కూడా ప్రకటించా రు. కుటుంబం, స్త్రీ, పురుష బాంధవ్యంతో ముడిపడ్డ సంతాన ప్రాప్తి, నేటి రాష్ట్ర, కేంద్ర పాలకులను ఇంతగా కదిలించటంలో ఉన్న రాజకీయం బాహాటంగా అంతగా బయటపడకపోయినా అంతర్లీనంగా ఆలోచింప చేస్తోంది. ‘అధికస్య అధికం ఫలం’ అనేది జనాభా విషయంలో ఆచర ణీయ సందేహంగా భావించటానికి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆశయ అంకురార్పణ నాంది అయింది. అదే చంద్రబాబు ఉవాచ. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చినతొలి దశాబ్దాలలో జాతి నేతలు, తిండి గింజల కొరత కారణంగా, కరవు కాటకాల సంక్షోభం ఎదుర్కోవలసి వచ్చింది. పి.ఎల్ 480, పథకం ప్రకారం అమెరికా నుంచి ‘ఫుడ్ ఫర్ పీస్ ప్రోగ్రామ్’ క్రింద గోధుమల దిగుమతి చేసుకోవలసి వచ్చేది. ఇందిరా గాంధీ ప్రధాని రోజుల నాటికి హరిత విప్లవానికి ప్రణాళికా బద్ధంగా కృషి సత్ఫలితాలు కొంతవరకు ఇచ్చింది. జనాభా తగ్గించుకోవాలనే శాస్త్రీయ అవగాహనకు అవకాశం కలిగింది. ఒక పక్క అధిక దిగుబడి కేంద్ర ప్రభుత్వ లక్ష్యం కాగా కుటుంబ, సామాజిక పదంగా కుటుంబ నియంత్రణ ద్వారా జనాభా అదుపు కర్తవ్యమైంది.
Read Also :Cough syrup : ఈ 'సుస్తీ'కి ఆంక్షలతో సరా!
Childbirth
Childbirth : శాస్త్రీయ విజ్ఞాన ప్రగతి
జవహర్లాల్నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు సమర్థవంతంగా దేశాన్ని నడిపిస్తున్న రోజులవి. 50 కోట్లకు మించని జనాభా వున్న స్వతంత్ర భారత ప్రధాని లాల్ బహాదూర్ శాస్త్రీజీ స్వయంగా ఇంట్లో కూడా ఒకపూట భోజనం అంటూ భారత జాతికి ఆదర్శనీ యమైన సందేశం అందించారు. ప్రజలు అక్షింతలు కూడా అతిజాగ్రత్తగా వాడేవారు. క్రమేపీ ప్రపంచం సాధించిన శాస్త్రీయ విజ్ఞాన ప్రగతి దేశం అందిపుచ్చుకుంది. చైనావంటి దేశాలు సింగిల్ చైల్డ్ పాలసీ నాటికే అమలు చేస్తున్నాయి. మనదేశంలో కూడా అధిక జనాభా, సృష్టించే అరిష్టాలు అధిగమింప చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉవ్వె త్తున కుటుంబ నియంత్రణ సంక్షేమప్రచారం, వైద్య ఆరోగ్య శాఖల అనుబంధంగా సామాన్య జనావళికి చేరువఅయింది. ప్రపంచంలో ఏ మతం అయినా ‘సృష్టించటం’ ప్రకృతి ధర్మంగా విశ్వసిస్తుంది. ఇస్లాం, క్రైస్తవ, హిందు ఏమత సిద్ధాంతమైనా అందుకే కుటుంబ నియంత్రణను వ్యతిరేకి స్తాయి. కాని ఆటవికం నుంచి ఆధునికం వరకు మానవ ప్రస్థానంలో సైన్స్ నాగరికతా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది.
మంది ఎక్కువయితే మజ్జిగ పల్చన
అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేదరికం స్వరూపానికి, అమెరికా వంటి సంపన్న రాజ్యాల లేమికి ఎంతో వ్యత్యాసం ఉంది. మంది ఎక్కువయితే మజ్జిగ పల్చన చేయటం తప్పదని భారతీయ కుటుంబ వ్యవస్థ గ్రహించింది. నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక సంతా నం వలన కలిగే అనర్థాలనుంచి, కుటుంబాన్ని తప్పించటా నికి చేపట్టిన సహాయ చర్యలు ఫలించాయి. నారు పోసిన వాడే నీరు పోస్తాడనుకొంటే పంట ఎండిపోక తప్పదని సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం పెద్దఎత్తున నియంత్రణ చేపట్టారు. ‘ఇద్దరు పిల్లలే ముద్దు’ ఆచరణ కారణంగా తల్లీ, పిల్లల ఆరోగ్యం ప్రధానాంశం అయింది. పిల్లలకు మంచి ఆహారంతో పాటు ఎందరో చదువు నేర్పించగలుగుతున్నారు. చింతలు లేని కుటుంబాలు సామాజిక ప్రగతికి దోహదం చేస్తున్నాయి. కుటుంబ నియంత్రణ తన జీవన కల్యాణానికి మార్గం చూపించింది. అందులో ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాల ప్రజలు మరింత చొరవ చూపించారు. విద్యా, వైజ్ఞా నిక రంగాలలో దక్షిణాది జనప్రగతి యావద్భారతానికి ఆద ర్శమైంది. కాని ప్రస్తుత ప్రధాని మోడీప్రభుత్వం గుర్తించిన, జనాభా ప్రాతిపదికన పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గడం, దక్షిణాది రాజకీయ పార్టీలకు ఆందోళన కలిగించే అంశంగా తలెత్తింది. బహుశా అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర జనాభా పెరుగుదలకు ప్రజలు సహక రించాలని తిరోగమన రీతిలో పిలుపు ఇచ్చి ఉండవచ్చు.
ఆడ, మగ వ్యత్యాసం
కుటుంబంలో పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యత కుటుంబ ఆర్థిక స్థితిగతులు పిల్లలను కనడం, చదువులు, పెళ్లిళ్లు, ఆరోగ్యాలు ఎన్నో వ్యక్తిగత వ్యవహారాలను బట్టి దంపతులు నియంత్రణ నిర్ణయం తీసుకొంటారు. ఒక విధంగా చెప్పా లంటే బాలకార్మికులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో వ్యవసాయ కార్మిక ఇతర చేతివృత్తుల శ్రామికవర్గాలు తమ పిల్లలను ఆస్తిగా భావించడానికి గండిపడింది. ఆడ, మగ వ్యత్యాసం కూడా తగ్గినట్లు కనపడినా చాలా కుటుంబాలలో మగ పిల్లవాడు శరణ్యం అనే భావన ఉంది. అందుకే ఇంకా భ్రూణహత్యలు, ఆడపిల్లల పట్ల నిరాదరణ కొనసాగుతోంది. సనాతన భారతీయ సమాజంలో మహిళకు స్వేచ్చగా, స్వ తంత్రంగా జీవించే అవకాశాలు లేవనే విషయం సుస్పష్టం. పురుష వాంఛలకు వ్యామోహాలకు కుటుంబ అవసరాలకు స్త్రీ బలి అయిన వృత్తాంతాలు కోకొల్లలు. పౌరాణికంగా, ధర్మశాస్త్రాలలో మనం ఎంత ఉన్నతంగా చిత్రీకరించుకున్నా పాతివ్రత్య ధర్మాలు, భర్త శవంతో చితిమంటలకు ఆహుతి, కావటం వంటి అమానుష క్రూరదుష్టిత్వం నుంచి బయట పడటానికి సుదీర్ఘకాలం పట్టింది. కేవలం పిల్లల్ని కనే యం త్రంగా భారతీయ మహిళ ఎంతో హింసా, వేదనలను అను భవించింది. అటువంటి నేపథ్యం నుంచి ఆటవిక అణచివే తల నుండి ప్రస్తుత 21వ శతాబ్ది మహిళా ప్రస్థానం అద్భు తంగా విజయాలను సాధిస్తోంది.
Childbirth
ప్రకృతి సహ జమైన ఐశ్వర్యం పిల్లల్ని కనటం
పురుష ప్రపంచాన్ని శాసించే నిలదీసే వ్యక్తిత్వం ఆధునిక మహిళకు సాధికారత ప్రసాదించింది. నవమాసాలు మోసిన మాతృమూర్తిగా, పాలిచ్చే తల్లిగా, నడిపించే కన్నతల్లిగా ఆమెకు ప్రకృతి సహ జమైన ఐశ్వర్యం పిల్లల్ని కనటం. 300 సంవత్సరాల క్రితం కాకతీయ మహారాణి రుద్రమదేవి ప్రసూతి ఆరోగ్య కేంద్రా లు నెలకొల్పినా, ఇందిరాగాంధీ ప్రధానిగా అత్యవసర పరిస్థి తిలో కొన్నివేల కోట్ల మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిగినా భారతీయ మహిళను ప్రస్తుతం పూర్తి సాధికారికత సాధించే వ్యవస్థవైపు నడిపిస్తున్నాయి. ఆధునిక కుటుంబ వ్యవస్థలో వివాహిత యువతీగా,గృహిణిగాపిల్లల్ని కనే స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు కబళించి అధిక జనాభా సృష్టిం చమని రాజకీయంగా ఎంత ఉన్నతులైనా, ఎంత ప్రబలమైన ఆకాంక్షలున్నా, కారణాలున్నా ప్రలోభపెట్టం, అధికార వ్యవస్థ ను శాశ్వితంగా పదిలపరచుకోవాలని నిరం తరం తపించే రాజకీయ నేతలకు తగదు. అవాంఛనీయం ప్రసవనం అంటే ఎక్కువమంది పిల్లలను కనడం. ప్రహసనం అంటేపరిహాసం. భారతీయ మహిళ ప్రసవప్రహసనాన్ని ఆహ్వానిస్తుందా?
-జయసూర్య
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :
సీసీ కెమెరాలు పెట్టి వేధింపులు.. పెళ్లయిన 48 రోజులకే వివాహిత ఆత్మహత్య!

