RRR Land Acquisition: ప్రభుత్వం ప్రాంతీయ రింగ్డ్ ప్రాజెక్టు ఉత్తరభాగం భూసేకరణ ఖర్చులను సగభాగం భరించి భూసేకరణ వేగవంతం చేసే దిశగా అడుగులు వేసింది.
తెలంగాణ ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు 626.37కోట్ల రూపాయలు ఇప్పటివరకు జమచేసింది. తాజాగా మంగళవారం మొదటి విడుత 527 కోట్లు జమ చేసినట్లు రోడ్డుభవానాలుశాఖ అధికార వర్గాలు తెలిపాయి. బిఆర్ఎస్ ప్రభుత్వహయంలో భూసేకరణలో నగవాగం బాధ్యత తీసుకొంటామని కేంద్రప్రభుత్వంకు తెలిపినప్పటికి 100కోట్ల రూపాయలు మాత్రమే అప్పట్లో అమచేశారు. ఉత్తరభాగంలో 162 కి.మి. నిడివితో రోడ్డు నిర్మించనున్నారు. 201కి.మీ దక్షిణభాగంలో రోడ్డు నిర్మించడానికి డిపిఆర్ సిద్ధం చేయడానికి కేంద్రం ఒక కన్నలెంట్ సంస్థను నియమించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం త్రిపులార్ రోడ్ కోసం నిధుల సేకరణకోసం హడ్కో నుంచి 2000కోట్ల రుణం కూడా పొందింది. బిఆర్ఎస్ చెల్లించిన వంద కోట్లు తాజాగా చెల్లించి డబ్బలులతో కలిపి 626.37 కోట్లరూపాయలు చెల్లించింది. త్రిపులార్ భూసేకరణ కోసం రాష్ట్రప్రభుత్వం తన వంతవాటా కింద 2560కోట్ల రూపాయులు ఉత్తరభాగం కోసం వ్యయం చేయడానికి నిర్ణయం తీసుకొంది.
Read Also: Narsingi News: ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమీక్ష
Speeding up RRR Land Acquisition
జిల్లాల వారీగా భూసేకరణ పురోగతి
రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర దిశవైపు భూసేకరణ కోసం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధికార యంత్రాంగం వేగం పెంచింది. సంగారెడ్డి జిల్లాలో శివంపేట, వెండికోలు, లింగంపల్లి, వెంకటకిప్పాటూర్ కోర్పోలు, గ్రామాలతోపాటు, సిద్ధిపేట జిల్లాలోని జగదేవప్పూర్, మర్కూక్ మండలాలు, భువనగిరి మండలం మినహా మిగిలిన అన్ని మండలాల్లో భూ సేకరణ కొలిక్కి వచ్చింది. త్రిపులార్ పరిధిలోని జిల్లా కలెక్టర్లు, ఆదనపు కలెక్టర్ రెవెన్యూ ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామాల వార్డ్ గా రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రైతులకు నచ్చజెప్పి భూములు ఇప్పించే పనిలో ఉన్నారు. ఉత్తర భాగంలో సంగారెడ్డి, మెదక్ సిద్దపేట, యాదాద్రి భువనగరి జిల్లాల మీదుగా సుమారు 162 కిమీ మేర ట్రిపుల్.ఆర్ వెళ్లనుంది.
భూముల సేకరణ కోసం ఆయా జిల్లాలో వేగం పెంచడమే కాకుండా సెలవురోజుల్లో కూడా రైతులతో సమావేశాలు నిర్వహించి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో శివంపేట, వెండికోలు, లింగంపల్లి, వెంకటకిష్పాటూర్ కోర్పోలులో ఏప్రిల్ 3న శుక్రవారం సమావేశం నిర్వహించి 298.23 ఎకరాల భూములు కోల్పోతున్న 581 మంది రైతులకు నోటీసులు జారీచేసి నచ్చచెప్పారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో మార్చి 16న జగదేవ్ పూర్, మర్కూక్ మండలాల పరిధిలోని చెబర్తి, అలిరాజ్పేట, పీర్లపల్లి, ఇటిక్యాల గ్రామాల రైతులతో ఆర్బిటరేషన్ ప్రక్రియ గురించి నిర్వహించి రైతులను ఒప్పించడానికి కలెక్టర్ కూడా ప్రత్యక్షంగా భూ నిర్వాసితులతో సమావేశమైనారు.
యాదాద్రి జిల్లాలో భూసేకరణ
యాదాద్రి జిల్లాలోని భువనగిరి మండలం రాయగిరి, చౌటుప్పల్లో ఆంగ్లక్షన్లు రామన్నాయి. లక్ష ఇందుకోసం 2,588 ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లిలో ప్రారంభయ్యే రీజినల్టింగ్డ్ యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మీదుగా వెళ్తుంది. యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల భూ సేకరణ క్రతువు దాదాపు పది అంకానికి చేరుకుంది. 19.19 కి.మీ.కు 540 ఎకరాలు సేకరించి అవార్డు కూడా పాస్ చేశారు. మల్లాపూల్లో పెండింగ్లో ఉంది. 290 ఎకరాలు సేకరించి 674 మంది రైతులకు రూ.57 కోట్లు చెల్లించారు. మిగిలిన వారికి పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు గౌస్నగర్, ఎర్రంబల్లిలో 484 ఎకరాల సేకరణ జరగాల్సి ఉంది. కోర్టు కేసుతో ఆగింది. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చినా రైతులు అభ్యంతరం చెప్పడంతో ఆగింది. ప్రస్తుతం కేసారం, పెంచికలపహాడ్ లో సర్వే పూర్తయ్యింది. అవార్డు కూడా చేశారు. రాయగిరి మినహా మిగిలిన మండలాల్లో సర్వే కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా రైతులకు డబ్బులు చెల్లించలేదు. వలిగొండ, చౌటుప్పల్ పరిధిలో 25.47 కిమీ రహదారి కోసం భూసేకరణ వేగంగా సాగుతోంది.
రైతులకు పరిహారం
ఈ రెండు మండలాల్లో 983 మంది రైతుల నుంచి 784 ఎకరాలు సేకరించేందుకు. నోటిఫికేషన్ జారీ చేశారు. 2,588 మంది రైతుల నుంచి సుమారు రెండు వేల ఎకరాలు సేకరించాలని ఎన్నెడఐ అధికారులు అభ్యర్ధన ఇచ్చారు. 1289 ఎకరాలకు రూ.532 కోట్ల పరిహారం చెల్లించేందుకు అవార్డు పాస్ చేశారు. ఇప్పటి వరకు 409 ఎకరాలకు 1035 మంది రైతులకు రూ.121,46 కోట్ల పరిహారం వారి ఖాతాల్లో జమ చేశారు. పరిహారం తీసుకున్న తుర్కపల్లి, యాదగిరిగుట్ట, వలిగొండ మండలాలకు చెందిన రైతులు పరిహారం పెంపునకు ధరఖాస్తు చేసుకోగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నిర్వాసితులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం కింద రూ.15,627 కోట్ల అంచనా వ్యయంతో సంగారెడ్డి నుంచి యాదగిరిగుట్ట చౌటుప్పల్ వరకు సుమారు 160 కిలోమీటర్ల మేర హ్యామ్ విధానంలో ఆరు లేన్ల రహదారిని ఐదు ప్యాకేజీల్లో నిర్మించాలని నిర్ణయించారు. సేకరించాల్సిన భూములకు 3ఏ నోటిఫికేషన్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినా, నష్టపరిహారం చెల్లించి భూముల స్వాధీనానికి ఉద్దేశించిన 3హెర్ నోటిఫికేషన్ మాత్రం ఇప్పటి వరకు శిశాతం మాత్రమే పూర్తికావడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

