Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు.. మధ్యాహ్న భోజనం కూడా!

ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు.. మధ్యాహ్న భోజనం కూడా!

వార్త 2 months ago

Telangana: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి, వారిని సప్లమెంటరీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

మోడల్ స్కూళ్లలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం నేటి (గురువారం) నుంచి ప్రత్యేక తరగతులు (Special Classes) ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: Narsingi News: ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమీక్ష

 Special classes for students who failed Inter… even lunch!

సప్లమెంటరీ పరీక్షలే లక్ష్యంగా శిక్షణ

రాష్ట్రంలో మే 13వ తేదీ నుంచి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, విద్యార్థులు తమకు కష్టమైన సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా మే 12వ తేదీ వరకు ఈ ప్రత్యేక శిక్షణ కొనసాగుతుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా టీచర్లు మార్గనిర్దేశం చేయనున్నారు.

Telangana: మధ్యాహ్న భోజన సౌకర్యం

ఈ ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో కీలక సౌకర్యాన్ని కల్పిస్తోంది. తరగతులు ముగిసిన అనంతరం విద్యార్థులకు అక్కడే మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. సప్లమెంటరీలో అందరూ ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

త్రిపులార్ భూసేకరణ వేగవంతానికి రూ.527 కోట్లు చెల్లింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha