China bans paper gold : అంతర్జాతీయ పసిడి మార్కెట్‌లో పెన్నడూ లేని విధంగా సంచలనం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగ దేశాలలో ఒకటైన చైనా, కాగితపు బంగారం (పేపర్ గోల్డ్) వ్యాపారంపై ఊహించని విధంగా కఠిన ఆంక్షలు విధించింది.
డ్రాగన్ కంట్రీకి చెందిన ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ICBC)తో పాటు ఆ దేశంలోని దాదాపు 90 శాతం బ్యాంకులు షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్‌తో ముడిపడి ఉన్న పలు ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ట్రేడింగ్‌ను తక్షణమే నిలిపివేశాయి. ముఖ్యంగా లీవరేజ్ ఆధారిత స్పాట్ కాంట్రాక్టులు.. డిఫర్డ్ కాంట్రాక్టుల సేవల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా, తమ ఖాతాదారులను వెంటనే పొజిషన్లను క్లోజ్ చేయాలని లేదా భౌతిక బంగారాన్ని డెలివరీ తీసుకోవాలని స్పష్టం చేశాయి.
Read Also: Ukraine Russia War: కీవ్‌పై రష్యా మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి.. 9 మంది మృతి
China bans paper gold
China bans paper gold : చైనా ప్రాథమిక లక్ష్యం
చైనా తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం వెనుక బలమైన ఆర్థిక వ్యూహాలు, రిస్క్ మేనేజ్‌మెంట్ దాగి ఉన్నాయి. సాధారణంగా పేపర్ గోల్డ్ వ్యాపారంలో ‘లీవరేజ్’ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. అంటే ఇన్వెస్టర్లు స్వల్ప మొత్తంలో మార్జిన్ మనీని చెల్లించి.. మార్కెట్లో చాలా పెద్ద పరిమాణంలో Gold పొజిషన్లను కొనుగోలు చేస్తుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో బంగారం ధరలు హఠాత్తుగా పడిపోతే.. ఈ లీవరేజ్ ట్రేడింగ్ వల్ల ఇన్వెస్టర్లతో పాటు బ్యాంకులు కూడా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ రకమైన ఊహాజనిత (స్పెక్యులేటివ్) ట్రేడింగ్‌ను అరికట్టడం ద్వారా తన ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచడమే చైనా ప్రాథమిక లక్ష్యం. దీనితో పాటు మార్కెట్‌లో కేవలం కాగితాలపై జరిగే వ్యాపారాన్ని పక్కన పెట్టి.. వాస్తవమైన భౌతిక (ఫిజికల్) బంగారానికి ప్రాధాన్యత ఇవ్వాలని చైనా భావిస్తోంది.
ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత.. హౌతీలపై భారీ ఆపరేషన్‌కు సౌదీ సిద్ధం!

