Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆగస్ట్ 16 నుంచి వారి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు రద్దు..!

ఆగస్ట్ 16 నుంచి వారి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు రద్దు..!

వార్త 2 weeks ago

EKyc : దేశంలో కోట్లలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఉజ్వల పథకంతో పాటు సాధారణ కనెక్షన్లు కూడా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారతీయ పెట్రోలియం కార్పొరేషన్ ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేస్తున్నాయి.

అయితే ఈ గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలని కంపెనీలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. చాలా మంది ఎల్పీజీ ఈకేవైసీ చేసుకున్నప్పటికీ కొంత మంది చేసుకోలేదు. మీరు ఇప్పటికీ గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ చేసుకోకుంటే.. వెంటనే చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్ట్ 15వ తేదీగా ఉంది. ఆ లోపు ఈకేవైసీ చేసుకోవాలని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.

Read Also: Student Protest Jharkhand : ఝార్ఖండ్లో 18 వ రోజుకు చేరిన విద్యార్థుల ఆందోళన

 eKyc

eKyc: గ్యాస్ కనెక్షన్ రద్దు అయితే మీకు సిలిండర్ బుక్ కాదు

గృహ వినియోగం కోసం ఎల్‌ల్పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు పొందిన వినియోగదారులందరూ తప్పుకుండా తమ గ్యాస్ కనెక్షన్ కోసం ఇ-కెవైసి ధృవీకరణ ప్రక్రియన పూర్తి చేయాలి. ఒకవేళ మీరు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకుంటే.. మీ గ్యాస్ కనెక్షన్ రద్ద అయ్యే అవకాశం ఉంది. గ్యాస్ కనెక్షన్ రద్దు అయితే మీకు సిలిండర్ బుక్ కాదు. ఈ నేపథ్యంలోనే ఆగస్ట్ 15లో తప్పుకుండా ఈకేవైసీ చేసుకోవాలని కంపెనీలు చెబుతున్నాయి. ఈకేవైసీ చేసుకోవడం చాలా సులభం.. గ్యాస్ సిలిండర్ డెలివరీకి వచ్చిన బాయ్ వద్ద యాప్ ఉంటుంది. అతని వద్ద ఈకేవైసీ చేసుకోవచ్చు. మీరు హెచ్పీ గ్యాస్ వాడితే హిందస్థాన్ పెట్రోలియం వెబ్ సైట్ కు వెళ్లీ ఈకేవైసీ చేసుకోవచ్చు.

వారానికి నాలుగైదు రోజులు చెరువు నీళ్లలోనే గడుపుతున్న 16 ఏళ్ల బాలుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha