Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆగస్టు ఆఫర్లు.. కియా కార్లపై భారీ డిస్కౌంట్లు!

ఆగస్టు ఆఫర్లు.. కియా కార్లపై భారీ డిస్కౌంట్లు!

వార్త 2 weeks ago

Kia India August Offers: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన కియా ఇండియా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు నెల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

తన ప్రాచుర్యం పొందిన సోనెట్‌, సిరోస్‌, సెల్టోస్‌, కరెన్స్‌ క్లావిస్‌, మరియు కార్నివాల్‌ వంటి మోడళ్లపై కంపెనీ పలు రకాల ఆర్థిక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్లలో క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, స్క్రాపేజ్‌ బెనిఫిట్, కార్పొరేట్‌ తగ్గించడంతో పాటు లాయల్టీ బోనస్‌లు కూడా ఉన్నాయి

Read Also : Artificial Intelligence : ఇండియాలో AI తో పెరుగుతున్న ఉద్యోగాలు ..రిపోర్ట్

 August offers… Huge discounts on Kia cars!

Kia India August Offers: సోనెట్, సిరోస్ మోడళ్లపై రాయితీలు

కియా సోనెట్‌ 1.2 హెచ్‌టీఎక్స్‌(ఓ) వేరియంట్‌పై రూ.10 వేల క్యాష్‌ డిస్కౌంట్‌ లభిస్తోంది. దీనికి తోడుగా రూ.20 వేల ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, రూ.15 వేల స్క్రాపేజ్‌ ప్రయోజనం, రూ.15 వేల వరకు కార్పొరేట్‌ బెనిఫిట్‌ను కస్టమర్లు పొందవచ్చు. ఇక పెట్రోల్‌ సిరోస్‌ మోడల్‌పై రూ.10 వేల క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.20 వేల ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, రూ.20 వేల స్క్రాపేజ్‌ ప్రయోజనం మరియు రూ.15 వేల కార్పొరేట్‌ బెనిఫిట్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే సిరోస్‌ ఈవీ వర్షన్‌పై ప్రస్తుతం ఎలాంటి అధికారిక డిస్కౌంట్లను కంపెనీ ప్రకటించలేదు.

సెల్తోస్ & కరెన్స్ క్లావిస్ ఆఫర్ల వివరాలు

విపరీతమైన ఆదరణ ఉన్న కియా సెల్టోస్‌పై రూ.20 వేల లాయల్టీ బోనస్‌తో పాటు రూ.20 వేల కార్పొరేట్‌ బెనిఫిట్‌ను అందిస్తున్నారు. కరెన్స్‌ క్లావిస్‌ టర్బో వేరియంట్‌పై రూ.10 వేల క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.30 వేల ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, రూ.20 వేల లాయల్టీ బోనస్‌, రూ.20 వేల స్క్రాపేజ్‌ ప్రయోజనం, రూ.15 వేల కార్పొరేట్‌ బెనిఫిట్‌ లభిస్తాయి. అలాగే కరెన్స్‌ క్లావిస్‌ ఈవీపై రూ.20 వేల క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.20 వేల ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, రూ.20 వేల లాయల్టీ బోనస్‌, రూ.20 వేల స్క్రాపేజ్‌ ప్రయోజనం మరియు రూ.15 వేల కార్పొరేట్‌ ఆఫర్లు కలవు.

కార్నివాల్‌పై గరిష్ఠ ప్రయోజనాలు

లగ్జరీ మోడల్ అయిన కియా కార్నివాల్‌పై ఈ నెలలో అత్యధికంగా రూ.1 లక్ష ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ను కంపెనీ ప్రకటించింది. దీనికి అదనంగా రూ.50 వేల వరకు కార్పొరేట్‌ మరియు స్క్రాపేజ్‌ ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక ఆఫర్లు కేవలం ఎంపిక చేసిన 2026 మోడల్‌ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తాయని, అలాగే డీలర్‌, నగరం మరియు స్టాక్‌ లభ్యతను బట్టి ఆఫర్ల మొత్తంలో వ్యత్యాసాలు ఉండవచ్చని సంస్థ తెలిపింది.

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..మారిన విత్ డ్రా నిబంధనలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha