Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబై పుచ్చకాయ మరణాలు.. ఫోరెన్సిక్ నివేదికలో సంచలన విషయాలు

ముంబై పుచ్చకాయ మరణాలు.. ఫోరెన్సిక్ నివేదికలో సంచలన విషయాలు

వార్త 1 month ago

టీవల మహారాష్ట్ర రాజధాని ముంబైలో బిర్యానీ, ఆ తర్వాత వాటర్ మిలన్ తినడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మృతదేహాల పోస్టుమార్టం అనంతరం ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదిక వెల్లడైంది.

ఈ నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. గత ఏప్రిల్ 25న ముంబైలోని జేజే మార్గ్ ఏరియాలో ఉండే అబ్దుల్లా డొకాడియా కుటుంబం ఓ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి వచ్చిన అతిథులంతా వెళ్లిపోయాక అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అబ్దుల్లా (40), ఆయన భార్య నస్రీన్ (35), వారి కూతుళ్లు అయేషా (16), జైనెబ్ (13) బిర్యానీ తిని, అనంతరం వాటర్ మిలన్ తిన్నారు. తర్వాత కొన్ని గంటల్లోపే వారికి తీవ్ర విరేచనాలు, వాంతులు ప్రారంభమయ్యాయి. దీంతో వెంటనే జేజే ఆస్పత్రికి వెళ్లినప్పటికీ, వారు చికిత్స పొందుతూ మరణించారు. అయితే, ఇలా బిర్యానీ తిని, ఆ తర్వాత వాటర్ మిలన్ తినడంతోనే ఈ మరణాలు సంభవించాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదిక విడుదలైంది.

Read Also: AP student suicide in Chicago: అమెరికాలో కర్నూలు విద్యార్థి ఆత్మహత్య.. కారణం ఇదే!

 Watermelon Deaths

Watermelon Deaths: అవయవాలు రంగు మారడంపై అనుమానాలు

పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాలను చూసి విస్తుపోయారు. సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు అవయవాలు ఇలా రంగు మారవు. కానీ, మరణించిన నలుగురి మెదడు, గుండె మరియు జీర్ణావయవాలు ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయి. ఇది ఏదైనా శక్తివంతమైన విష ప్రయోగం వల్లనే జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు అబ్దుల్లా శరీరంలో ‘మార్ఫైన్’ అనే ప్రమాదకర రసాయనాన్ని గుర్తించారు. శరీరమంతా విషం వేగంగా వ్యాపించడం వల్లే అవయవాల రంగు మారిందని నిపుణులు భావిస్తున్నారు. బాధితులు తిన్న పుచ్చకాయ (వాటర్ మిలన్) ఎక్కడి నుండి వచ్చింది, దానికి ఏమైనా విషపూరిత రసాయనాలు కలిపారా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సోదరుడి వివాహానికి వచ్చి విగతజీవిగా మారిన అన్న

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha