Petrol Price in Pakistan: పాకిస్థాన్ ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, రికార్డు స్థాయి ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ఇలాంటి గడ్డు కాలంలో అమెరికా, ఇరాన్ మధ్య రేగిన యుద్ధ వాతావరణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బకొట్టింది.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్ల పైకి చేరాయి. చమురు దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడే పాకిస్థాన్‌పై ఈ గ్లోబల్ సంక్షోభం నేరుగాప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లను తట్టుకోలేక, మే మొదటి వారంలో అక్కడి ప్రభుత్వం లీటర్ పెట్రోల్ ధరను ఏకంగా రూ. 14.92 మేర పెంచింది. దీనితో పాకిస్థాన్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ ధర గరిష్ఠంగా రూ. 414.78 కి చేరి దేశ ప్రజలను డిగ్భ్రాంతికి గురిచేసింది.
Read Also :Shooting In Mexico: మెక్సికోలో ఓ సాయుధుడి కాల్పులు..10 మంది మృతి

నరకప్రాయంగా మారిన సామాన్యుడి జీవితం!
అయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంధన ధరలను సమీక్షిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా నిన్నటి నుంచి అమల్లోకి వచ్చేలా పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరుకు రూ. 5 మేర స్వల్పంగా తగ్గించారు. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 409.78 (సుమారు రూ. 410) పలుకుతుండగా, హై-స్పీడ్ డీజిల్ ధర కూడా లీటరుకు రూ. 409.58 వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వ సమీక్షలో ధరలు స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ, సామాన్య ప్రజల కోణం నుంచి చూస్తే లీటరుకు రూ. 410 అనేది ఇంకా మోయలేని భారంగానే మిగిలిపోయింది.
Petrol Price in Pakistan: ఈ-బైక్‌ల వైపు మొగ్గు చూపుతున్న ప్రజలు
ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో పాకిస్థాన్‌లో అంతర్గతంగా రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీనితో నిత్యావసర వస్తువులైన పాలు, కూరగాయలు, మందుల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడి దైనందిన జీవితాన్ని మరింత నరకప్రాయంగా మార్చాయి. పెట్రోల్ కొనడం తమ ఆర్థిక పరిధిని దాటిపోవడంతో, అక్కడి ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రావల్పిండి వంటి ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ బైక్‌లకు డిమాండ్ భారీగా పెరిగినట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

