Akividu Ramalayam Case: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణరాజు ఆకివీడు రామాలయం అంశంపై బుధవారం హైకోర్టులో స్వయంగా హాజరై వాదనలు విన్పించారు.
ఇదే అంశంపై విజయవాడలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మాణం అనుమతులు లేకుండా జరుగుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన రఘురామ కృష్ణంరాజు స్వయంగా కోర్టుకు వెళ్లి తన వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా రామాలయం నిర్మాణం భక్తుల విరాళాలతో జరుగుతోందని తెలిపారు, అన్ని చట్టబద్ధ అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు కొనసాగిస్తామని రఘురామ కోర్టుకు హామీ ఇచ్చారు.
Read also: Vegetable Prices Today: ఒక్కసారిగా పెరిగిన కూరగాయల ధరలు

RRR arguments in Akividu temple case
Akividu Ramalayam Case: చట్టపరమైన అనుమతులతోనే ఆలయ నిర్మాణం
చట్టపరమైన నిబంధనలను పూర్తిగా పాటిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో కోర్టు రామాలయంపై ఎటువంటి ప్రతికూల ఉత్తర్వులు ఇవ్వలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం తరఫు న్యాయ వాదుల వాదనలు, తన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. అలాగే చట్ట పరమైన నిబంధనలు పాటిస్తామని ప్రభుత్వం నుంచి అండర్ టేకింగ్ ఇవ్వాలని కోర్టు కోరగా, అందుకు ప్రభుత్వ న్యాయవాదులు అంగీకరించారని, దీంతో కేసు ముగించారన్నారు. ఆలయం, చర్చి, మసీదు అన్న తేడా లేకుండా అన్ని మతపరమైన కట్టడాలకు చట్టం సమానంగా వర్తించాలన్నారు. ఏ నిర్మాణానికైనా కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
సోషల్ మీడియా దుర్వినియోగంపై డిజిపి హరీష్ కుమార్ గుప్తా హెచ్చరిక

