Vegetable Prices Today: సామాన్యుడి వంటింట్లో కూరగాయల ధరలు మంట పుట్టిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న ధరలు అకాల వర్షాలు, వేసవి తాపానికి పంటలు దెబ్బతినడంతో ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.
మార్కెట్‌కు దిగుబడి తగ్గడంతో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, గుంటూరులలో ధరలు భారీగా పెరిగాయి.
Read Also: Madanapalle tomato price: టమాటా ధరకు రెక్కలు.. కిలో ఎంతో తెలుసా?
Vegetable Prices Today: Vegetable prices have increased sharply
హైదరాబాద్ రైతు బజార్లలో ధరల పరిస్థితి
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వంటి ప్రధాన రైతు బజార్లలో టమాటా ధర గతంలో రూ.10 ఉండగా, ఇప్పుడు అది రూ.23కు చేరింది. కేవలం టమాటాయే కాకుండా ఇతర కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుత ధరల ప్రకారం బీన్స్ కిలో రూ.60 పలుకుతుండగా, బెండకాయ రూ.35గా ఉంది. సరఫరా ఇంకా తగ్గితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
Vegetable Prices Today: ఏపీలోని ప్రధాన నగరాల్లో ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విజయవాడలో కిలో టమాటా ధర రూ.28కి చేరగా, గుంటూరు మార్కెట్‌లో రూ.22కు అమ్ముడవుతోంది. అల్లం, వెల్లుల్లి ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. అకాల వర్షాల వల్ల చేతికి వచ్చిన పంట నీటిపాలవ్వడం, ఎండల తీవ్రతకు పూత రాలిపోవడం వంటి కారణాల వల్ల మార్కెట్‌కు లోడ్లు తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కూరగాయల ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా అధికంగా ఉండటంతో మధ్యతరగతి ప్రజల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. ముఖ్యంగా అల్లం, వెల్లుల్లి ధరలు కొండెక్కడంతో వంటింటి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

