AP Aqua Farmers: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధిపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా 'బ్లూ ఎకానమీ' (నీలి విప్లవం) వృద్ధిని లక్ష్యంగా చేసుకుంటూ ఆక్వా రంగానికి మేలు చేకూర్చే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
cm chandrababu naidu announces electricity subsidy for new aqua connections
కొత్త ఆక్వా కనెక్షన్లకూ విద్యుత్ సబ్సిడీ
రాష్ట్రంలో కొత్తగా నమోదైన ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు పెద్ద ఉపశమనం కలిగించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న యూనిట్‌కు రూ. 1.50 విద్యుత్ సబ్సిడీని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 12,680 ఆక్వా కనెక్షన్లకు కూడా వర్తింపజేయాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో 50 వేల కనెక్షన్లకు గానూ ప్రభుత్వం ఏటా రూ. 1,100 కోట్ల సబ్సిడీ భారాన్ని మోస్తోంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై అదనంగా మరో రూ. 188 కోట్ల ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా సాగవుతున్న 4 లక్షల ఎకరాల ఆక్వా భూములను పూర్తిస్థాయిలో 'ఆక్వా జోన్' పరిధిలోకి తీసుకురావాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు.
Read also: Farm to Home: ఫార్మ్ టు హోమ్.. రైతుల కోసం సీఎం చంద్రబాబు సరికొత్త విధానం
AP Aqua Farmers: బ్లూ ఎకానమీ బలోపేతం & మత్స్యకారులకు సాయం
ఆక్వా రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు క్వాలిటీ సర్టిఫికేషన్ (నాణ్యత ధృవీకరణ), ట్రేసబిలిటీ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే సముద్ర తీర ప్రాంత మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం రూ. 240 కోట్ల అంచనా వ్యయంతో 200 అత్యాధునిక మెకనైజ్డ్ బోట్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని అంతర్గత నీటి వనరులను వాడుకుంటూ చేపల పెంపకాన్ని (ఇన్‌లాండ్ ఫిషరీస్) ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.
90 నియోజకవర్గాల్లో ఆధునిక రైతు బజార్లు
వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేయడంలో భాగంగా రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో అత్యాధునిక రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు ప్రజలకు నాణ్యమైన కూరగాయలను నేరుగా అందించేందుకు 'డిజి రైతు బజార్' (Digi Rythu Bazar) మొబైల్ యాప్‌ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయి ప్రసాద్‌తో పాటు పలువురు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

