Farm to Home: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాంది పలికారు. రైతులు పండించే పంటలు, ముఖ్యంగా పండ్లు, కూరగాయలను దళారీల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజల ఇళ్లకే అందించే 'ఫార్మ్ టు హోమ్' (Farm to Home) విధానాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన వ్యవసాయ, అనుబంధ రంగాల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
A Brand New Initiative by CM Chandrababu for Farmers
రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPOs) భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని స్పష్టం చేశారు. దీనివల్ల రైతులకు లాభసాటి ధర లభించడంతో పాటు, వినియోగదారులకు కూడా సరసమైన ధరలకే తాజా ఉత్పత్తులు అందుతాయని సీఎం పేర్కొన్నారు.
ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత.. ఎల్ నినోపై ముందస్తు వ్యూహం
రాబోయే రోజుల్లో రాష్ట్రంపై ‘ఎల్ నినో’ ప్రభావం పడే అవకాశం ఉన్నందున, వాతావరణ మార్పులను తట్టుకునేలా ప్రాంతాల వారీగా పంటల ప్రణాళికలు సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులకు కనీస మద్దతు ధర (MSP) దక్కేలా కేంద్ర ప్రభుత్వ మద్దతు తీసుకోవాలన్నారు.
కెమికల్స్ రహిత సాగు: రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి.
భూసార పరీక్షలు డిజిటలైజేషన్: ప్రతి భూమికి సాయిల్ టెస్ట్ నిర్వహించి, ఆ వివరాలను ఆన్‌లైన్‌లో రైతులకు అందుబాటులో ఉంచాలి.
ప్రత్యేక కౌంటర్లు: రైతు బజార్లలో ఆర్గానిక్/ప్రకృతి సేద్య ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలి.
నీటి పొదుపు సాగు: నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో పీఎండీఎస్ (PMDS), హాఫ్ మూన్ వంటి ఆధునిక పద్ధతుల్లో సేద్యం సాగించాలి.
Read also: AP Liquor Scam : ఈడీ ఎదుట చెవిరెడ్డి కుటుంబం.. లిక్కర్ కేసులో కీలక విచారణ
Farm to Home: రాయలసీమకు ‘హార్టికల్చర్ హబ్’గా రూపాంతరం.. రీజినల్ ప్లాన్స్ ఇవే:
ప్రాంతాల వారీగా వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం భారీ వ్యూహాన్ని రచిస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
రాయలసీమ అభివృద్ధికి రూ.లక్ష కోట్లు
‘పూర్వోదయ’ పథకం కింద రూ.40 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు, గోదాములు, రవాణా సౌకర్యాలు వంటి మౌలిక వసతులు కల్పించనున్నారు. దీనికి అదనంగా మరో రూ.60 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించి రాయలసీమను దేశంలోనే అతిపెద్ద ఉద్యానవన హబ్‌గా మారుస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి అరటి పంట నిల్వ కోసం ప్రత్యేక కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.
విద్యా, పరిశోధనా రంగాల బలోపేతం
ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్: మదనపల్లెలో ప్రతిష్టాత్మక అగ్రికల్చర్ స్కూల్ నిర్మాణానికి జూలై నాటికి శంకుస్థాపన చేయనున్నారు.
ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్: పులివెందులలో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ పనులను వేగంగా పూర్తి చేసేందుకు తక్షణమే రూ.3 కోట్లు విడుదల చేశారు.
కోకో సిటీ: తూర్పుగోదావరి జిల్లా యడవోలు (దేవరపల్లి మండలం) ప్రాంతంలో ‘కోకో సిటీ’ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను కోరారు.
వ్యవసాయ యాంత్రీకరణ
వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించడానికి క్లస్టర్ల వారీగా ప్రణాళికలు రూపొందించి, రైతు సాధికార సంస్థ ద్వారా అధునాతన హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాలను రైతులకు అందుబాటు ఉంచాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

