Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో భానుడి భగభగలు..నేడు అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత

ఏపీలో భానుడి భగభగలు..నేడు అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత

వార్త 3 months ago

AP Temperature : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. వేసవి తాపానికి జనం అల్లాడిపోతుండగా, రోజురోజుకూ ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.

ఈ రోజు రాష్ట్రంలోనే అత్యధికంగా గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురులో 47.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై అధికారిక వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా, పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లతో పాటు బాపట్ల జిల్లా ఇంకొల్లులో 47.3 డిగ్రీల మేర భానుడు ప్రతాపం చూపించాడు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తుండటంతో రోడ్లన్నీ జనసంచారం లేక నిర్జనంగా మారుతున్నాయి. తీవ్రమైన వడగాల్పులు తోడవడంతో బైకర్లు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read Also : ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ వేగవంతం..సీఎం చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష

 Rising temperatures in AP

12 జిల్లాల్లో దాటిన 45 డిగ్రీలు.. అల్లాడుతున్న కోస్తా, రాయలసీమ!

రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత ఎంతలా ఉందంటే.. మొత్తం 26 జిల్లాలకు గానూ ఏకంగా 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేసి ముంచెత్తాయి. ప్రకాశం జిల్లా కొండేపిలో 46.7 డిగ్రీలు, మార్కాపురం పరిధిలోని పెద్ద దోర్నాలలో 46.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మైదాన ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంత సరిహద్దుల్లోనూ వేడి గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే రెండు, మూడు రోజులు కూడా ఇదే విధమైన పొడి వాతావరణం, తీవ్ర వడగాల్పులు (Heat Waves) కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

సుగాలి ప్రీతి హత్య కేసు.. వైఎస్ జగన్‌ను కలిసిన తల్లిదండ్రులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha