Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆంధ్రప్రదేశ్ లో మహిళలు, చిన్నారుల రక్షణకు కఠిన చర్యలు

ఆంధ్రప్రదేశ్ లో మహిళలు, చిన్నారుల రక్షణకు కఠిన చర్యలు

వార్త 1 week ago

Vangalapudi Anitha:మహిళల బాలల అక్రమ రవాణాను తీవ్రస్థాయిలో అడ్డుకుంటామని హోం మంత్రి వంగలపూడి అనిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంద్యారాణి స్పష్టం చేశారు.

స్త్రీలు పిల్లల జోలికి వచ్చిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ 3వ బ్లాక్, 1వ అంతస్తు కాన్ఫరెన్స్ హాల్లో కీలక సమావేశంలో మంత్రివర్యులు గుమ్మిడి సంద్యారాణి, హోంమంత్రి వంగలపూడి అనిత సంయుక్తంగా నిర్వహించారు. మహిళలు చిన్నారుల భద్రత మరియు రక్షణకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో బాలల రక్షణ వ్యవస్థల బలోపేతంపై అధికారులతో చర్చించారు.

Read also: Polavaram news: లేగదూడలపై పులి పంజా..పోలవరం జిల్లాలో 13 ఆవుదూడలు హతం

 Curbing the Trafficking of Women and Children

Vangalapudi Anitha:స్త్రీలు పిల్లల జోలికి వచ్చిన వారికి అదే చివరి రోజు

రాష్ట్రంలో బాలల అక్రమ రవాణా, తప్పిపోయిన పిల్లలు, విడిపిచెట్టిబడిన పిల్లలు, యాచకులుగా జీవిస్తున్న చిన్నారులు మరియు ఇతర ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిలలల గుర్తింపు, రక్షణ, పునరావాస చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, హోంశాఖల సమన్వయంతో వన్ స్టాప్ సెంటర్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని బాధిత మహిళలు, చిన్నారులకు వేగవంతమైన సహాయ సేవలు అందిస్తున్నాయని మంత్రులు తెలిపారు. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను హోమ్ శాఖతో కలిసి సామాన్యం చేసుకోవాలని సమీక్ష చేపట్టారు. శాఖల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్తాయిలో సేవల అమలు వేగవంతం చేయాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారుల భద్రత, సంక్షేమం ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యత అని మంత్రులు స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఏవియేషన్ లో మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha