Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏవియేషన్ లో మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు

ఏవియేషన్ లో మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు

వార్త 1 week ago

Aviation jobs for women: విమానయాన రంగంలో కూడా మహిళలకు విశేషమైన ఉపాధి అవకశాలు ఉన్నాయని, సరైన రీతిలో శిక్షణ తీసుకుంటే మంచి వేతనాలతో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.

మంగళవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని అయన స్వగృహంలో ఉమెన్ ఇన్ ఏవియేషన్ కార్యక్రమంలో శిక్షణ తీసుకుని ఉపాధిని పొందిన అయిదుగురు యువతులు తమ నియామక పత్రాలను రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసిన రామ్మోహన్ నాయుడు. పౌర విమానయాన రంగంలో మహిళలకు ఉపాధి అవకశాలు మెండుగా ఉన్నాయనే అంశానికి ఈ అయిదుగురు యువతులు బ్రాండ్ అంబాసిడర్లు పని చెయ్యాలని పిలుపునిచ్చారు. మహిళలకు ఏవియేషన్లో ఉపాధి విప్లవాన్ని అందుబాటులో ఉంచే విధంగా ఉమెన్ ఇన్ ఏవియేషన్ కార్యక్రమాన్ని రూపొందించారు. రామ్మోహన్ నాయుడు సరిగ్గా ఏడాది క్రితం శ్రీకాకుళం నగరంలోని ఉమెన్స్ కళాశాలలో ఏవియేషన్ అంశంపై వ్యాసరచన కార్యక్రమాన్ని నిర్వహించి అందులో మొదటి అయిదు స్థానాల్లో నిలచిన యువతులకు ఏవియేషన్ రంగంలోని పలు విభాగాల్లో శిక్షణను హైదరాబాద్లో ఇప్పించారు.

Read also:Nara Lokesh Russia Visit: మాస్కోలో రష్యా స్బేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ తో లోకేష్ భేటీ

 Aviation career opportunities for women

Aviation jobs for women: భవిష్యత్ దిశగా బ్రాండ్ అంబాసిడర్లు

ఏవియేషన్ రంగంలోని టికెటింగ్, కస్టమ్స్, కార్గో, క్యాబిన్ క్రూ, ఇతర విభాగాల్లో పూర్తి స్థాయి శిక్షణను అందించారు. ఈ శిక్షణను అయ్యే ఖర్చును కూడా ఉమెన్ ఇన్ ఏవియేషన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయిలో వారిని ఉద్యోగాలను సిద్ధం చేశారు. ఏవియేషన్లోని పలు విభాగాల్లో పూర్తి స్థాయి తర్ఫీదు అనంతరం ఉద్యోగాలను సంపాదించిన ఆ అయిదుగురు యువతులు మంగళవారం నాడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో అయన స్వగృహంలో భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఎంపిక సమయం నుండి శిక్షణ, ఉద్యోగం పొందే వరకు ఎదురైన అనుభవాలను వారిని అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం ప్రతిభను చాటారంటూ మెచ్చుకుంటూనే భవిష్యత్లో ఉమెన్ ఇన్ ఏవియేషన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని కోరారు. మహిళలు ఏవియేషన్ విభాగంలో అనేక ఉపాధి అవకశాలు సిద్ధంగా ఉన్నాయని, ఆ దిశగా అందరు అవగాహన తెచ్చుకుని తమ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని రామ్మోహన్ నాయుడు కోరారు. ఉద్యోగాలు పొందిన అయిదుగురు యువతులు త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా తమ విధులను నిర్వర్తించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha